Friday, January 26, 2018

DEEPAAVALI-03

ప్రమదముతో వెలుగుచున్న ప్రమిదలోనిదీపములు
నట్టింటను వెలిగేటి నవావరణ దీపములు
గుట్టుగా వెలుగుచున్న గుట్టమీది దీపములు
ఇనబింబపు కీర్తిని ఇనుమడించు దీపములు
త్రిగుణాత్మకతను తెలుపు అగణితగుణ దీపములు
సభలలో వెలిగేటి సరస్వతీ దీపములు
అసురత అను నరకుని నరికేటి దీపములు
భూదేవి రణరంగపు భూషణములు దీపములు
ధనత్రయోదశి వెలుగు ధగధగల దీపములు
చతుర్దశి హారతుల కర్పూర దీపములు
అమాసను మరిపించే సితవికసిత దీపములు
మిలమిలా మెరయుచున్న తైలలక్ష్మీ దీపములు
కంటిచూపు నందించిన ముక్కంటి మింటి దీపములు
జలజాక్షులకు జయమనెడు జలములోని దీపములు
ఉత్తరభారత ఉగాది ఉత్సవము దీపములు
వి స్తృత వ్యాపారముల ద స్త్రములు దీపములు
యమకోరల నడ్డగించు శుభకరములు దీపములు
బాణసంచా వెలిగించే జాణలు దీపములు
కాలిపోతూ వెలుగునిచ్చు త్యాగశీల దీపములు
మానవతను చాటిచెప్పు మాణిక్యదీపములు
ప్ర జ్ణాప్రదీపనమను వి జ్ణానపు దీపములు
పరమాత్ముని రూపములు కొండెక్కని దీపములు
కొండంత వెలుగునుచ్చు గోరంత దీపములు
అండనుండ జనావళికి బ్ర హ్మాండ  దీపావళి


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...