NAANNAKU VANDANAMU-07

నాన్నకు జేజేలు
నాన్నా,
నన్ను తప్పుపట్టు సంతతి సిద్ధమయ్యె,
నాన్న మాట గుట్టు వింతగ అర్థమయ్యె
....................
కనుసన్నల పాలన సేయు నిన్ను నా
కన్నులు తేరిచూచె,మొనమొన్నటిదాక
కనుగానని మైకమే చేరువాయెగా
కనువిప్పుగ మనసును మెప్పుగ అప్పగించెదన్
....................
చేతుల రాతలమార్చు చేరువ దేవుని నిన్ను నా
చేతలు వెక్కిరించె చేవను తెలియగలేక
చేయిజారక పట్టిన చేయి తోడుగా
చేతులు జోడించి మొక్కులు చక్కగ అప్పగించెదన్
.....................
కరుణను గడ్డినీయగ రవికిరణంబగు నిన్ను నా
గరువంబున తలెత్తిచూడ తలపైనను లేక
భారపు కుమారా అను పిలుపుసాక్షిగా
సారపు దండముల్ వేసారగ నీయక అప్పగించెదన్
......................
పాటపు బాట వేయుటలో మేటివి నిన్ను నా
వెటకారపు మాటలతోడ మోమాటమే లేక
గోటికి సాటిరాని వాడినని నేటికి తెలిసెగ
కటకట ముమ్మాటికి పటుతర మెప్పులను అప్పగించెదన్
......................
తనూ భూజము విస్తరించగ బీజమువైన నిన్ను నా
మనమున మోజులు తేలియాడ నిజమెరుగక
అనయము ఆశీర్వచనముల ధన్యతనొందిన
మనోభావము ప్రస్తుతించగ అఖండ కీర్తులను అప్పగించెదన్
.............ధన్యోస్మి..................

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI