Friday, January 26, 2018

HEMALAMBI UGADI-03

ఉగాది
స్థిత ప్రజ్ఞతలో హేమాహేమీలంటు
హామీ నేనే నంటు ధీమాగ వస్తున్నది
హేమళంబి ఎలియాస్ హేవళంబి @ 32
అతిమెల్లగ కదులుటచే ముప్పది సంవత్సరాల
సమయము పట్టుతుంది శనికి చుట్టడానికి
పన్నెండు రాశుల చక్రాన్ని.
మెల్లగ కదులుటచే పన్నెండు సంవత్సరాల
సమయము పట్టుతుంది గురువు చుట్టడానికి
పన్నెండు రాశుల చక్రాన్ని
30:12 సంవత్సరాల కనిష్ఠ సామాన్య గుణిజమే 60
అందుకే తెలుగు సంవత్సరాలు అరవై.
జాబిలి కూతురులో లేదా నారద కుమారులో
వాటిపేర్లు ప్రభవ నుండి అక్షయ అని
వరాహమిహిరుడు అన్నాడు భృగు సం హితలో
వారించబడక కొనసాగుతున్నాయి కాల గతిలో
గురువు-శని గమనములో ప్రతికూలమో/అనుకూలమో
ఇతర గ్రహ కిరణాలకు గురి అవుతున్నారు
గుణ-దోష భూఇష్ఠముల వాటి పరిణామములే
ప్రతి ఒక్కరి ముందునున్న పంచాంగ ప్రమాణాలు.

ఏది ఆదాయమో ఏది రాజ పూజ్యమో
వ్యయము వ్యవహారమేమో అసలేది అవమానమో
అతిగా ఆలోచించారా( గురువు-శని)
సమయమెక్కువవుతుందని సగములో ఆపరు కదా
సతమతమగు నడక యని సహనము కోల్పోవరు కదా
నిజమే
ఆరు శత్రువుల కట్టడియే ఆరు రుచుల పచ్చడి
ఆశావాదపు వెచ్చదనమేగా ఆ వసంతపు పచ్చదనము
హేమము బంగారపు పర్యాయ పదము
సేమముగా చూపుతుంది బంగారపు పథము.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...