Friday, January 26, 2018

JAYA UGADI-04

 జయనామ ఉగాది శుభాకాంక్షలు
తిథి,వార,నక్షత్ర,యోగ,కరణములన్నీ
విధులను నిర్వహిస్తూ చరచరా తిరుగుతుంటే
క్షయమును దాటి లక్షణము ప్రభవిస్తే
భూగోళ,ఖగోళములు యుగళగీతమైపోతే
వేళాపాళా విలువ వేనోళ్ల చాటుతుంటే
విజ్ణానపు నిచ్చెన వేసి అజ్ఞానము తొలగిస్తే
దినకరునితో నిషూ,వైశాఖీ సాగుతుంటే
హిమకరునితో గుడిపడ్వా,ఇతరములు సాగుతుంటే
సూర్య,చంద్రులిద్దరిని ఆర్యులుగా పూజిస్తూ
నింబకుసుమ భక్షణము,నిత్య ఆరోగ్య లక్షణము
నిఖిలగ్రహ రక్షణము,నియమపాలన అనుక్షణము
ఏ దేవుని పేరులేని, ఏ ఘనత చాటుకోని
పండుగ కాదా మన జయనామ ఉగాది.
.........
బ్రహ్మకల్ప సృష్టియో,పురాణ వేద రక్షణయో
సం స్కృత పద వి కృతియో సంస్కార ఆకృతియో
కృత కృత్యుల గావించు సమయనియమము ఉన్న
జయనామ ఉగాదిలో జనావళికి జయము తధ్యం
సెకను నుండి శకము వరకు కాదేది అసాధ్యం

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...