TIRUPPAAVAI-05

ఆళిమళై కణ్ణా! ఒన్రు నీకై కరవేల్
ఆళి ఉళవుక్కు ముగందుకొడు ఆర్తు ఏఱి
ఊళి ముదల్వ నురువంపోళ్ మెయి కఱుత్తు
పాళియన్ తోళుదై పఱ్పనాబన్ కైయిల్
ఆళిపోళ్ మిన్ని వలంబురిపోల్ నిన్ర అదిరింద్
తాజాదే శార్గముదైత్త శరమళైపోల్
వాళ ఉలగనిల్ పెయిదాడాయ్ నాంగుళుం
మార్గళి నీరాడ మగిళింద్ ఏలో రెంబావాయ్.
ఓం నమో నారాయణాయ-4
*************************
విచిత్రముగ నామది " శ్రీ విల్లిపుత్తూరుగా" మారినది
" విష్ణు చిత్తీయమై" శ్రీహరిని కీర్తించుటనే కోరుతోంది.
పాండవ రథ సారథి " శౌర్యపు గర్జనయైన"
కడలినీరు కడుపునిండ " గర్జనవలె త్రేంచు మేఘములో"
దుష్టశిక్షణార్థము " రాముని శరవేగ పోలికయైన"
వేగముతో వర్షించే " అలుపెరుగని మేఘములో"
శిశుపాలుని వధియించి శ్రీకరముగ" మెరయుచున్నదైన"
"సుదర్శన చక్రము" వలె " మెరయుచున్న మేఘములో"
" నామ,రూప,సారూప్యములు" అవిభాజ్యములైన
"సాక్షాత్ నీలమేఘ శ్యాముడైన" ఆ నీలి మేఘములో
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్ల బరచగ భక్తిపూల మాలలతో నేడె.
భావము
శ్రీ కృష్ణుని పరాక్రమము వలె గర్జించు మేఘములో,రామబాణ వేగముతో సమానమైన వేగముతో వర్షించు మేఘములో,శిశుపాలుని వధించి,తెల్లనైన కాంతితో మెరయుచున్న సుదర్శన చక్రము వంటి మెరుపులున్న మేఘములో,ఇన్ని మాటలేల! సాక్షాత్ ఆ నీల మేఘ శ్యామునితో అభేదమైన ఆ నీలిమేఘములో నిమగ్నమైన నా మనసు,పాశురములను కీర్తించుచు,భక్తి అను పూలను శరణాగతి అను దారముతో అల్లిన హారములను స్వామికి సమర్పించ, చెలులారా కదిలి రండి.తెల్ల వారుతోంది.
( ఆండాళ్ తిరువడిగళై శరణం

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI