VAAHVA-JIHVA

వాహ్వా-జిహ్వా
నరములేని నాలుకవని , నరులకెంత చులకనమ్మా
తలమానిక భాగమైన, తలలోని నాలుక...... జనులు.....
మడతపెడితే నీకసలు, మరియాదేదంటారు
మోహముగా కదిలావో, అహంకారము అంటారు
అటు ఇటు ఆడావంటే, అబద్ధనివి అంటారు
బయటకు వచ్చావంటే, భద్రకాళివి అంటారు......కాని తెలుసుకుంటే...
ఇలలోని జోలపాట, ఇలవేలుపు నీవమ్మా
విందు భోజనాలలోన, ముందు పీట నీదమ్మా
సరిగమలు దద్దరిల్ల, సహకారము నీవమ్మా
సరస్వతీ కృపాకటాక్ష, స్థానమే నీవమ్మా
పదునైన పండ్ల మధ్య, పదిలంగ ఉండగలవు ....పాపం అపనిందలా...
రుచి బాగుందని అన్నావు కాని, లాగించమని అన్నావా
మాట సాయమన్నవుగాని, లేసి మాటలు అనమన్నావా
మాయదారి మనసు మాట, మరీ మరీ మన్నిస్తూ
బుద్ధి గడ్డితిన్న జనులు, నిన్ను బద్ధ శత్రువు అంటారా
సరిహద్దుల్లోనే సర్దుకునే నీ, సౌశీల్యపు సాకారము
సరిదిద్దనీ మాలోని, సద్గుణాల సంస్కారాన్ని.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI