dasara-01

మంచికి అంకురార్పణము మొదటిదిన ప్రత్యేకత
అపరిశుబ్ర నివారణము అదియేగ భారతము
మదించిన రాక్షస బలము రెండవ దిన ప్రవేశిక
అసురభావ మర్దనము అద్యేగ దైవత్వము
ఆకలి నిర్మూలనము మూదవదిన ప్రణాళిక
అన్నపూర్ణ అవతారము అదియేగ ఆహారము
వర్ణవ్యవస్థ నినాదము నాలుగోరోజు శీర్షిక
కర్మ సంస్కారములు అద్యేగ గాయత్రీ ప్రవేశము
రక్తబీజ ప్రస్థానము ఐదోరోజు కదలిక
శక్తి వాని సమ్హారము అదితేగ కాళికారూపము
పృకృతి సేవనము ఆరోరోజు అవతారిక
ప్రస్తుతీ అర్చనలు అద్యేగ బతుకమ్మ సంప్రదాయము
అవిద్యా నిర్మూలనమునకు ఏడవ రోజుకు అవనిక
సారస్వతారాధనము అదియేగ సరస్వతీ రూపము
వర్గభేద నిర్మూలనము ఎనిమిదోరోజు కృతకృత్యత
స్వర్గతలము భువి అదియేగ మహాలక్ష్మి ప్రసాదము
ఆయుధాల పూజనము తొమ్మిదోరోజు నవ్యత
పరిశ్రమావతరణము అదియేగ ఆదిశక్తి పరాక్రమము
జమ్మిచెట్టు పాలపిట్ట పదోరోజు ధన్యత
నేలనింగి కలుపుట అది యేగ సమర్థత

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.