TIRUPPAAVAI-08



కీశు కీశెన్రెగుం ఆశైచ్చాతాన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్పెణ్ణే
కాశుం పెఱప్పుం కలకల్ప్పైకె పేర్తు
వాశ నఱుం కుజలాయిచ్చ మత్తినాల్
ఓశై పడుత్త తయిర రవం కేట్టిలైయో
నాయగ పెణ్ పిళ్ళాయ్ నారాయణ మూర్తి
కేశవునై పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశ ముడైయాడ్ తిఱన్ ఏలో రెంబావాయ్
ఓం నమో నారాయణాయ-7
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది
భరధ్వాజ పక్షులకు భగత్చింతన యైన
ఖగరాజ వాహనుని సుప్రభాత సేవలలో
ముద్దరాలు ఈమె అని నిద్దురలేపుచున్నదైన
ప్రేమ పూరితమగు "పిచ్చి పిల్లా " అను పిలుపులో
నవ మన్మథుని మించిన నగధర రూపమైన
అగణిత గుణగణుని కొలుచు అగరు ధూప పరిమళములో
రేపల్లెలో గొల్లెతలు చల్ల చిలుకు వేళయైన
నల్లనయ్యను పిలుచు కవ్వపు సవ్వడులలో
తెల్లవర వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్ల బరచగ భక్తిపూల మాలలతో నేడె.
భావము
పుణ్యాల పంటైన భరధ్వాజ పక్షుల కిచకిచలలోను,ఆండాళ్ తల్లి గోపికను ప్రేమతో పిలిచిన "పిచ్చిపిల్ల" అను పిలుపులోను,స్వామి కైంకర్యములో ధన్యమగు చున్న అగరుధూపముల లోను,గొల్లెతల కవ్వపు శబ్దములలోను నిమగ్నమైన నా మనసు,
పాశురములను సంకీర్తించుచు,భక్తి అను పూలను,శరణాగతి అను దారముతో అల్లిన హారములను సమర్పించుటకు చెలులారా కదిలిరండి.తెల్లవార వచ్చుచున్నది.
(ఆండాళ్ తిరువడిగళే శరణం )..

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI