Friday, January 26, 2018

GURUVU-03

గుండె చప్పుడు
రైతు సాగు చేస్తాడు-గురువు బాగు చేస్తాడు
రైతు పొలము దున్నుతాడు-గురువు మనల దువ్వుతాడు
రైతు విత్తు చల్లుతాడు-గురువు విద్య అల్లుతాడు
రైతు నాట్లు వేస్తాడు-గురువు బాట వేస్తాడు
రైతు కాపు కాస్తాడు-గురువు కొమ్ము కాస్తాడు
రైతు కలుపు తీస్తాడు-గురువు గెలుపు చూస్తాడు
రైతు పంట కోస్తాడు-గురువు వెంట వస్తాడు
రైతు పంట నూర్చుతాడు-గురువు భవిత మార్చుతాడు
రైతు కడుపు నింపుతాడు-గురువు వెలుగు నింపుతాడు
.......
కడుపు నింపు వారొకరు-కలిసి నడచు వారొకరు
ఋషి తుల్యులు ఇరువురు-నిత్య కృషీవలురు వారు
రైతే రాజైతే-గురువు రాజు అండ మంత్రియేగ
రైతు వెన్నెముక ఐతే-గురువు గుండె చప్పుడేగ
........
జై కిసాన్----జై మహాన్-----జై శ్రీ సర్వేపల్లి రాధా కృష్ణన్
********************************* .

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...