Friday, January 26, 2018

TELUSUKO

తెలుసుకో
=============
కోటీశ్వరులకు నీవు పోటీగా ఎదగాలని
సాటిలేనిదంటు దాని మేటితనము చాటుకుంటూ
అమెరికా అభివృద్ధిని ఆదర్శము అని అంటూ
సలాం అంటూ దానికి నీవయ్యావు గులాము,.
............................................................
అందమైన నయాగరా జలపాతం పరుగు చూడు
మంచుకొండ అంచున పొంచియున్న ప్రభలు చూడు
కల్పనాచతురతగల శిల్పకళల గుహలు చూడు
చారెడు కన్నుల తోడ తారల వన్నెలు చూడు
అందమైన ప్రకృతికి నీవయ్యావు బందీవి
.................................
ఐఫోను,ఐపాడు,ఐ మాక్సు
ఈమెయిలు,ఈచాటు,ఈవెబ్‌
పెండ్రైవు మరియెన్నో కనుగొన్నది టాలెంటు
సాంకేతిక సౌరభమా,సమకాలీన సహవాసమా నీ
ఘనత చాటుతానంటూ అయ్యావు బంటువి
............................................
అన్నావు నువు బెస్తని,ఎదిగావు ఎవరెస్టని
ఎటుచూసినా నీదేగా లేటెస్టు హాట్‌ న్యూసని
నీ నీడగా ఉంటున్న నిజమును తెలిసికోలేక
విజయాల మత్తులో మునిగావు నీవు
చిత్తుచేసినానంటూ మారినావు తొత్తుగా
........................................
ఒకటి,రెండు,మూడు చేసి ఓడించాననుకోకు
పరమాత్మను కనుగొనని పరిశోధన ఫలితమేమి
అన్నింట ఉన్నది అది,ఆనందపు వెల్లువ అది
ఆత్మయను రెల్లు అది,అజ్ణానపు చెల్లు అది
తెలుసుకో,తెలుసుకో,తెలివిగా మసలుకో.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...