Friday, January 26, 2018

TIRUPPAI-12

కత్తు కఱవై కణంగళ్ పలకఱందు
శెత్తాల్ తిఱల్ అరయ చెన్రు శెరుచ్చెయుం
కుత్తం ఒన్రిల్లాద కోవలర్ దం పొఱ్కొడియె
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తుత్తోరిమార్ ఎల్లారుం వందు నిన్
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్పాడ
శిత్తాదే పేశాడే శెల్వ పెణ్డాట్టి నీ
ఎత్తుక్కుఱగుం పొరుళ్ ఏలో రెంబావాయ్.
ఓం నమో నారాయణాయ-11
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది
" మాధవ కణంగల్" అనబడు సాధురూపములైన
అరిషడ్వర్గములంటని సురభుల గోష్ఠములో
అస్ఖలిత బ్రహ్మమునకు అనిశము శిరోధార్యమైన
అస్ఖలిత బ్రహ్మచారి ఆ బర్హి పింఛములో
"సెండ్రుం-సెరుం-సెయ్యం" అంటు అతిపరాక్రమములైన
అరి సం హారముచేయు బుద్ధికుశలతలో
పుట్టలోపల చుట్టినదేహముతో పడగ విప్పినదైన
పుట్టినింటి గౌరవమును పెంచు ఆ " బంగరు మొలకలో"
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్ల బరచగ భక్తిపూల మాలలతో నేడె.
భావము
లెక్కపెట్టలేనన్ని సద్గుణముల ప్రోవులైన గోగణములున్న గోశాలలలోను,ప్రశాంత ప్రసన్న సౌందర్యమైన నెమలి లోను,దుష్టత్వమను శత్రువును గుర్తించి,తనకు తానుగా దండెత్తి,శాంతిని నెలకొల్పు భుజ పరాక్రమములోను,పుట్టలో చుట్టుకున్న దేహముతో,పడగ విప్పి పరవశించు పామువంటి గోపిక యందు, ( ఇది సామాన్యార్థము )
లెక్కలేనన్ని సద్గుణములు కల సాధు పుంగవుల ఆశ్రమములలోను,శిఖిపింఛమౌళి అనుగ్రహ సౌందర్యములోను,మనలోని దుర్గుణములను శత్రువులను గుర్తించి తనకు తానే వాటిపై దండెత్తి సమసింపచేయు గొల్లస్వామి పరాక్రమమునందును,వినయ ప్రతీకగా తన శరీరమును పుట్టయందు చుట్టుకొని, (మాయా జగతి పుట్టలో తన శరీరమునుంచి-భక్తి అను పడగను విస్తరింప చేసిన)భక్తిభావ పడగను విస్తరింపచేయుచున్న,"బంగరు మొలక" అని అమ్మచే పిలిపించుకుంటున్న గోపికలో,( ఆళ్వారులో) నిమగ్నమైన నా మనసు,పాశురములను కీర్తించుచు,భక్తి అను పువ్వులను,శరణాగతి అను దారముతో అల్లుచున్న హారములను స్వామికి సమర్పించుటకు చెలులారా! కదలి రండి. తెల్లవారు చున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...