Friday, January 26, 2018

GURUVU-04


ఆనందపు వెల్లువ..కదా గురు పూర్ణిమ.
.......
విద్యలో,వినయములో నీవు చూడ గలిగితే దేవుని
ఆద్యంతపు వెన్నెల..కాదా గురు పూర్ణిమ
...........
బుడుగులో,బడుగులో నీవు చూడగలిగితే దేవుని
అడుగులో అడుగు...కాదా గురుపూర్ణిమ
.......
ఆకలిలో,అన్నములో నీవు చూడ గలిగితే దేవుని
కలి సం హారము ..కాదా గురు పూర్ణిమ
..........
వెలుగులో,చీకటిలో నీవు చూడ గలిగితే దేవుని
వెతలు తీర్చేది కాదా గురు పూర్ణిమ
............
శాంతిలో,సహనములో నీవు చూడ గలిగితే దేవుని
వ్యాసానుగ్రము..కాదా గురు పూర్ణిమ
.........
మనిషిలో,మన కృషిలో నీవు చూడ గలిగితే దేవుని
మన కృషి ఫలితము..కాదా గురు పూర్ణిమ
............
మాధవ సేవను మించిన మానవ సేవను అందిస్తే
గురు దక్షిణ అనుకోదా...గుర్తించిన...గురు పూర్ణిమ

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...