HOLI-02

హోళి
రంగులనే హంగులతో సింగారాలను అలదుకొని
అంతరంగాల పొంగేటి ఆనందాలేగా హోళి
పిండారబోసిన వెన్నెలంటి మన మనసులలో
నిండారగ హరివిల్లై మెండుగ మెరిసేది హోళి
గుసగుసలాడుతున్న పసితనమంతా మిసిమై
గులాములుగా చేసేసి గులాల్ చల్లుతుంది హోళి
కన్నెపిల్ల బుగ్గమీద కదలాడే రంగులుగా
కన్నుల పండుగ చేసే కామదహనపు హోళి
అత్తారింటిలో నున్న ఏమాత్రము చిత్తు కానన్న
కొత్త అల్లుడిని భంగుమత్తులో ముంచేసేదే హోళి
అందనే అందమంటు అందంగా పందెమేసిన
పిచికారిచేతితో పరుగులు తీయించేది హోళి
అసలేమి చేయమంటు ముసిముసిగా నవ్వేసి,చిటికెలో
సునేరీని పూసేస్తూ శుభాకాంక్షలంటుంది హోళి
ఎంతటివారినైనా వింతగ ఏమార్చేస్తూ, ఎంచక్కా
చిట్టి పొట్టి సీతాకోక చిలుకలను చేస్తుంది హోళి
పైపైకి ఎగరమంటు పట్టుకోండి స్వర్గమంటు
సై అంటే సై అంటు సరదా చేసేస్తుంది హోళి .

తప్పెట్లు -తాళాలు చప్పట్లు -సందళ్ళు
హోళిక ఎక్కడుంది ఎపుడో పారి పోయింది.
చెన్నుగ ఆడగ రండి-చెన్న కేశవుని హోళీ.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.