RAAKHEE-04


 రాఖీ పండుగ శుభాకాంక్షలు
విశిష్టమైన పండుగ..రక్షాబంధనము
విశ్వసోదరత్వానికి..విశిష్ట.ఇంధనము
ఆడపడచులదేమో..అంతులేని.ఆపేక్ష
అన్నతమ్ముల ప్రేమ వారికి శ్రీరామరక్ష
..............
......సోదరులను  ఆడపడచులు......
అందమైన ఆసనమున వారిని కూర్చుండపెట్టి
ఒట్టువేసినట్టు వారి..నుదుట..బొట్టుపెట్టి
గళమున హారములను వేద్దాము
మంగళ హారతులను ఇద్దాము
అగ్గిని సాక్షినిచేసి వారు నెగ్గాలని కోరుదాము
మనసులోని ప్రీతితో తీపిని తినిపిద్దాము
శ్రావణ పున్నమి జరిగే కన్నుల పండుగ సాక్షిగ
వెన్నుని ఆశీసులు వారిని సుసంపన్నులు చేయాలని
మేమున్నామని వారిచేతికి బంధాలను కడదాము
.........................................
అన్నదమ్ములు..ఆనందంతో.........
కన్నతల్లి కలలను..కమ్మని.నిజాలుచేస్తూ
ముచ్చట తీర్చగ..మా.వద్దకు..వచ్చిన..తోబుట్టువులు
ఏ.పాదము..ఎత్తనీము..ఆపదను...ఆపెదము
కనురెప్పల్లో..అనుక్షణం..కాస్తాము..లక్షణంగా
నేల పాదు నేనౌతా..చిరు నవ్వుల సోదరి
వేల వేల సిరుల పూలు..పూయనీ..నీదరి
మీరు లక్షింతలు కావాలని అక్షింతలు వేస్తూ

రాఖీ కట్టిన.చేయికి...చేయూతగ..ఉంటాము
శుభం భూయాత్.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.