NAANNA OKA MEDHAVI-05

 నాన్న ఒక మేధావి


 పసికందుగ ఉన్న నన్ను పదిలంగా పెంచుతున్న
 వాసికందు నాన్నను నే ప్రత్యక్షము కాంచుతున్నా

 నా ముఖము మీది చిరు నవ్వును మురిపెంగా చూశావు
 పలకరిస్తూ నీవు పొందు పులకరింతను నే చూశా

 నా అల్లరి చేష్ఠలను అనురాగంతో చూశావు
 ఎల్లలు దాటిన ప్రేమను నీ ఎదలో నే చూశా

 నా అడుగు వేయునపుడు పడిన తడబాటును చూశావు
 తప్పటడుగు వేయని నీ గొప్పతనము నే చూశా

 నా వచ్చీరాని మాటకు ముచ్చటగా చూశావు
 నీ నచ్చిన మాటలు ప్రశంసలు తెచ్చుటయే నే చూశా

 నా మొదలైన చదువుతో నేను ఎదగాలని చూశావు
 చదువుకుంటూ ఒదిగిపోవు మేధావిని నే చూశా

 నే చూసిన ప్రతి అంశము సందేశము అనుకొని
 ఎదిగి ఒదిగి నాన్నకు నా అభినందన అందిస్తా

ఎందుకంటే నాన్నంటే నాకిష్టం , నాన్నకు నేను ఇష్ఠం

నీ చిన్నారి

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI