Friday, January 26, 2018

TIRUPPAAVAI-16

ఎల్లే! ఇళం కిళియే! ఇన్నం ఉరంగుదియో
శిల్ ఎన్రారై యేన్మిన్ నంజైమీర్ పోదరు గిన్రేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పందేయున్ వాయదిఱిదుం
వల్లీర్గళ్ నీంగళే నానే తానాయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్ -ఎణ్ణిక్కోల్
వల్లానై కొన్ఱావై మాత్తారై మాత్తళిక్క
వల్లానై మాయనై పాడ ఏలో రెంబావాయ్.
ఓం నమో నారాయణాయ-15
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది.
లేమ!" లేత చిలుకతో' పోల్చబడినదైన
పరిణితముగ పలుకుచున్న "పదియవ గోపికలో"
"నీంగళే-నీవల్లే" అను వాదోపవాదములైన
కృష్ణమాయ కమ్ముకునిన " గోపికల సం శయములో"
బంధింపబడిన తలుపు అటు-ఇటు వాక్చమక్కులైన
చక్కని చుక్కల మక్కువ పరిహాసోక్తులలో
" తిరు-పావై" అను వేదబీజ స్వరూపమైన
పదిహేను రోజుల వ్రత పుణ్య పూర్వ భాగములో
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్లబరచగ భక్తిపూల మాలలతో నేడె.
భావము
అమ్మచే నిద్రలేపబడుతున్న చిన్ని చిలుకవలె పలుకుతున్న పదియవ గోపికలో,ఇదంతా నీవల్లే అంటే నీవల్లే అని నిందించుకొనుచున్న గోపికలలో,మూసిఉన్న తలుపునకు రెండువైపులనుండి పరిహాసపు మాటలాడుకొనుచున్న గోపికలలో,వ్రతములో సగభాగము పూర్తియైనదన్న విషయములో గోపిక మనసు లగ్నమైనది.(ఇది సామాన్యార్థము.)
పరమ భాగవతోత్తములైనను గోకులము నందు గోపికలుగా జనించి,మధురభక్తితో
మధుసూదనుని కొలువగా సిద్ధమగుచునారు.భక్త సులభులైన లక్ష్మీనారాయణులు పామరులుగా కనిపించు గొల్లెతల ద్వారా అమ్మ పాశురముల అమృతభాండము నందించుటకు కదులుచున్నారు.లేత చిలుక అను సంబోధన జ్ఞానమూర్తి యని చెప్పకనే చెప్పుచున్నది.ఆళ్వారులనందరిని తమతో కలుపుకొని సఖ్యభక్తికి సాకారమైన ఆండాళ్ అమ్మను అనుసరించుచు మధుర భక్తితో సేవనమునకై తరలుచుండుటలో పూర్వభాగము సుసంపన్నమైనది.
తెల్లవార వచ్చెను అనగా నల్లనైన తమోగుణము అస్తమించి,తెల్లనైన సత్వగుణము ఉదయించుటకు సిద్ధముగా నున్నది.అమ్మచే నిద్దురలేపబడుతున్నది పదియవ గోపిక అను పదియవ ఇంద్రియము.(బుద్ధి)కనుకనే "లేత చిలుక" శుక మహర్షి పలుకులను తెలిసికొనగలుగుచున్నది.మూసిన తలుపు భగవంతునికి -భక్తులకు మధ్యనున్న" మాయతెర".చక్కని చుక్కలు అనగా" ఆధ్యాత్మిక పరిజ్ఞానముగల అనుభవజ్ఞులు".వారు "తర్క-మీమాంసాది శాస్త్ర విచారణల" గురించి చేయు చర్చలే నీవల్లే నీవల్లే అని చేయుచున్న వాదోపవాదములు.తెర తొలగించమని చేయుచున్న ప్రార్థనలు..అవి పండితులకు మాత్రమే కాకుండా గొల్లలకు సైతము అందుబాటులో ఉండుటకై" ఆండాళ్ తల్లి" పరమ దయతో అనుగ్రహించిన శ్రీవ్రత పాశురములు అని గ్రహించిన మనగోపిక, అమ్మ గోదాదేవి చేయించుచున్న వ్రతములో తానును,
స్వయముగా పాల్గొనవలెనని సంకల్పించుకొన్నదన్న ఆలోచనలో నిమగ్నమైన" నా మనసు",పాశురములను కీర్తించుచు,భక్తి అను పువ్వులను,శరణాగతి అను దారముతో అల్లిన హారములను స్వామికి సమర్పించుటకు చెలులారా! కదిలిరండి.తెల్లవారుచున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...