DEEPAAVALI-01

తమసోమా జ్యోతిర్గమయా
********************
బంతిపూల తోరణాలు,పూబంతుల హారతులు
మా లక్ష్మి వస్తుందని తరలి వచ్చిన బంధువులు
మంగళ వాయిద్యాలు,మధురస నైవేద్యాలు
తాతయ్య చేతిలోని తాటాకు టపాకులు
కథ చెబుతూ బామ్మగారు,ఊ కొడుతూ బాబిగాడు
ఉయ్యాల ఊగుతూ ఉంగాల పాపాయి
బావగారి ఆటపడుతు కత్తిలాంటి మరదళ్ళు
గమ్మత్తుగ ఉందంటు కొత్త పెళ్ళికూతురు
బడాయి బడా బాబులు,హడావిడి మెరుపుతీగలు
కొత్త చీర రెపరెపలు,సుతిమెత్తని చలోక్తులు
చింతలేక గంతులేయు చిరు మువ్వల తువ్వాయిలు
చెంత చేరి వంతపాడు సిరిమల్లెల పరిమళాలు
పాలకడలి తల్లికై గుమ్మములో గుమ్ముపాలు
తులతూగే సిరులతో తులసికోట దీపాలు
అందరితో అంటున్నవి "ఆనంద దీపావళి" అని
దాగుడుమూతలాడే చీకటి తన ఉనికినే
మరచిపోయి,వలసపోయి,కలసిపోయె
"వేవేల వెలుగుల దీపావళి" గా.
శుభాకాంక్షలు

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI