Friday, January 26, 2018

PUSHKARAM@144



పుష్కరం @ 144
సుజలాం,సుఫలాం,మలయజ శీతలాం
సస్య శ్యామలాం మాతరం వందే మాతరం-బంకించంద్ర చటర్జీ
ఆహా...
జలముల,జలజముల,జలకముల,జగత్కళ్యాణముల,సకల కళల,సకల్ శాస్త్రముల,సంగమమై,అనేకానందాలతో మిళితమైన ఆధ్యాత్మక సంబరాలు పుష్కరాలు.పుష్కరాలలో సంతోషాలు పుష్కలాలు.
(విబుధ జనుల వలన విన్నంత,కన్నంత,తెలియ వచ్చినంత)
గోదావరి పుష్కరాల గురించి ముచ్చటించుకునే ముందు గోదావరిని గురించి,పుష్కరము గురించి తెలిసి కొనుటకు ప్రయత్నిద్దాము.( మీకు తెలియదని కాదు సుమండీ)
పూర్వము శీండిలుడు అను రాజు ఘోర తపమును ఆచరించి,శివుని జలరూపమున శాశ్వత స్థానమును సంపాదించి పుష్కరుడిగా మారినాడు.పుష్కరుడు అనగా పునీతుడు అని భావిస్తారు.ఆ సమయములో భూలోకములో జనులు నీరు లేక,తిండిలేక,మునులు సంధ్యావందనాది క్రతువులు చేయలేక,గణపతి సహాయముతో ఒక పథకమును వేసిరి.ఒక మాయా గోవును సృష్టించిరి.అది పంటను మేయుచున్న సమయమున గౌతముడు ఒక గడ్డి పరకతతో దానిని అదిలించగా,అది కింద పడి 
మరణించెను,గోహత్యా పాతకమును తొలగించుటకై భూమిపై గంగను ప్రవహింపచేయవలెనని 
ప్రాయస్చిత్తమును సూచించిరి.గౌతముడు శివుని ప్రార్థించగా శివుని అనుగ్రహముచే గంగను భూమిమీద వదులుటకు అనుగ్రహింపబడేను,గంగ ఏడు పాయలుగా చీలి గలగల ప్రవహించ సాగినది.గౌతమునిచే భూమికి త్రలించ బడినది కనుక గౌతమి అని,దక్షత అనగా సమర్థత గలది కనుక దక్షిణ గంగ అని,ఘో శరీరమును తాకి కిందకు ప్రవహింప బడునది కనుక గోదానది అని పిలువ బడవలెను కాని గోదానది శబరి నదిని కలిసి గోదావరిగా పునీతమైనది
పుష్కరము అనగా పోషణ,పునీతము,పద్మము,12 సంవత్స్రముల కాలము అని వ్యవహరింపబడుచున్నదిసూర్యుడు ప్రతినెల ఒక రాశిలో ప్రవేశించుటను సంక్రమణము అందురు,మకర సంక్రమణము.అదే విధముగ బృహస్పతి ప్రతి సంవత్సరము ఒక్కొక్క రాశిలో ప్రవేశించునపుడు ఒక్కొక్క నదీందు బృహస్పతితో పాటుపుష్కరుడు ఆ నదీజలాల లోనికి ప్రవేశించు చుండును.బృహస్పతి సిమ్హరాశిలోనికి ప్రవేశించు నపుడు,బృహస్పతితో పాటు,పుష్కరుడు కూడా భౌగోళిక,ఖగోలిక శాస్త్రానుసారము గోదావరీ జలాలలోనికి ప్రవేశించి వానిని పునీతము చేయును.మొక్కోటి నదుల సంగమము పుష్కరము,మొక్కోటి యోగుల,శాస్త్రముల,విద్యల సంగమము పుష్కరము.అదే పద్మనబడు జ్ఞాన సంకేతము.సమస్త జగములకు పోషణను ఇచ్చే ప్రణాళిక కార్య రూపమే పుష్కరము.కాల మానమును అనుసరించి పన్నెండు సంవత్సరములకు ఒక్కసారి వచ్చు ప్రకృతి పండుగయే పుష్కరము.పరమపదించి ప్రకృతి రూపులైన పెద్దలను సంస్మరించి,సత్కరించుటయే పుష్కరము.ప్రకృతి పరిణామముల ప్రశాంతతయే పుష్కరము.కనుక ప్రతి మనిషి ప్రకృతిని గౌరవించుటయే సంస్కారము.పరిరక్షించుటయే సంస్కార ప్రాకారము.పరిణితి చెంది ప్రవర్తించుటయే పురుషార్థ ఆవిష్కారమైన పుష్కరము
సర్వే జనా సుఖినో భవంతు.
( సవరణలు సంతోషదాయకములు-వినయముతో}
.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...