RAAKHEE-03

రాఖీ బంధన శుభాకాంక్షలు
దారపు ధారణ కాదు అసాధారణ గౌరవము
వెన్నంటి వెల్లడించు ఆడపడుచు అనురాగము
........
వెంట సిరులు జాలువారాలను అన్న ఆశ సత్యము
కలకంఠి కంటినీరు కావాలి సంతోషపు ముత్యము
.......
చిర్రు బుర్రు దరిచేర రాదని జగడము
ఎర్ర కన్నుతో వెర్రిని తుర్రుమనిపించే పగడము
......
పుట్టింటి ప్రేమ అనే ఆడపడచుల త్రిభువన ఒకే ధనము
పెట్టుబడిగ పెద్దగ పెరగాలి సోదర గోమేధికము
.........
భాతృజనము అందించే బహుమతుల ఇంద్రజాలములు
ఇంతుల నీలాల కన్నులలోని ఇంద్రనీలములు
.......
ఏకోదరులైన వారి మమతల చాణుక్యతలే
అన్నా చెల్లెళ్ళ,అక్కా తమ్ముళ్ళ అరచేతి మాణిక్యములు
.....
చెడ్డతనము అడ్డగించు వారి మనో ధైర్యములు
విడ్డూరమును అందించే దొడ్డ వైఢూర్యములు
.........
విశ్వ సోదరత్వమును చాటు విశిష్ట అనురాగములు
శాశ్వత ఆనంద భాష్పాలగు పుష్య రాగములు
.......
పాపాలను పరుగెత్తించే ప్రజా వ్రజములు
పది కాలాలు పదిలముగ దాచుకునే వజ్రములు
........
ఆ చంద్ర తారార్కము అనుసరించాలనే ఆస
ప్రపంచ పచ్చదనము ప్రతిరూపపు పచ్చపూస.
.......
రక్త సంబంధమో రక్షణ అను బంధమో
విలక్షణ హరిచందనము "రక్షా బంధనము".

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI