VIJAYA UGADI

ఉగాది
అనాదిగా ఆదిదైన అందమైన ఉగాది
జయము జయము జయ మమ్మా విజయనామ ఉగాది
అంగ రంగ వైభవముగా రంగవల్లులేసి
మిడి మిడి తలపులు వదిలి మామిడులను కట్టి
అభ్యంతరమును బాపే అభ్యంగానమాడుదాము
నూతన విలువల కూడిన కొత్త వలువలనే కట్టి
బంధు మిత్రులందరితో సందడి చేస్తుండగా
… వచ్చిన ఆ ఉగాది తల్లికి
జలధారలు జలాజాక్షిని జలకములాడించగా
కోనసీమ పచ్చకోక ముచ్చట తీర్చింది
వరమై పరవశమై గళ సరమాయెను కోయిల స్వరం
తూరుపు కిరణము తల్లికి హారతులీయగ సాగె
తృష్ణ తీర్చి కృష్ణానది మృష్టాన్నము లందించగా
చల్లలైన పిల్లగాలి మెల్లగ డోలికనూపె
ప్రవాసాంధ్ర హృదయాలను తన నివాసము చెయదలచివచ్చి
…ఆ తల్లి ఉగాది పచ్చడి గురించి ఇలా అంది
ఇది మమకారపు శ్రీకారము అని కారం అంటున్నది
మెప్పులు ఉప్పొంగాలని ఉప్పు చెప్పు చున్నది
ప్రీతిగా ఉండాలంటూ తీపి ప్రయాత్నిస్తున్నది
వలపు తలపు పిలుపుకై పులుపు చూస్తున్నది
చిగురు పొగరు అణచమని వగరు మనలను అంటున్నది
విజ్ఞానం చేదు* అని చేదు బోధిస్తున్నది (చేదు* = తోడుకోవడం )
అరిశాద్వార్గాముల నణచ అమరెను షడ్రు చులు
అరమరికలు లేక ఆరు రుచులను విందాము
అని చెప్పెను అంత
హాయిని గొలిపే ఆ సాయం సంధ్య యందు ఇది
మా నవ వసంతమా లేక మానవ వసంతమా అని
సందియమున నేనుండగా అందముగానపుడు
పంచాంగ శ్రవణము ప్రపంచ భ్రమణమును తెలిపే
స్వర్ణ కన్య నలరించు పూర్ణకుంభ మందుకొనగ
మీన మేష మెంచకురా కానీయర పనులను
వృషభ పౌరుషమును నేర్చి కృషి చేస్తూ నీవు
మహారాజులా బ్రతకమని మృగరాజు అంటున్నది
కొండెతో కొండెములను కాటు వేయ వృశ్చికము
కర్కశ ముగ కసాయిని కడతేర్చును కర్కాటకము
పతితుల పాలించగ ఇల ప్రతి మనసు ధనసు కాగా
శ్రీకరములు నికరములు అని మకరము కరమెత్తె చూడు
ఆధునికతో మైధునమై అద్యంత సుధా మధురమై
పన్నెండు రాశులు మన వెన్నండగ నుండగ
తడ బడక అడుగులను వడి వడిగా వేస్తూ
స్వచ్చ మైన పచ్చ దనపు అచ్చ తెలుగు పండుగ చేద్దాము
శుభం భూయాత్
నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి
03. 21. 2013

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)