Friday, January 26, 2018

NAANNAMTE NAAKISHTAM-06

నాన్నంటే నాకిష్టం,నాన్నకు నేనూ ఇష్టం
పక్కన నాన్నుంటే,ఆనందం అక్కున ఉన్నట్లే
తక్కినవెన్నున్నా చక్కని లెక్కకు రానట్లే
అమ్మా,మనమందరము అభినందనలు తెలుపుదాము
...............
బుల్లి బుల్లి చేతులతో లిల్లీలను మాలకట్టి
గళమున అలంకరిస్తా,మంగళమని మోగిస్తా
మురిపాల పాలబువ్వ ముద్దు ముద్దు మాటలతో
నీకో ముద్ద,మరి నాకో ముద్ద అంటూ,నాన్నకు
గోరుముద్ద తినిపిస్తా,జోలపాట వినిపిస్తా
సేదతీరు నాన్నవద్ద ఆదమరచి నిదురిస్తా
నాన్న కదలికలు అన్నియు మెదులుతూ నిదురలో
అనువాదము చేసెను వేదసారముల్ కుదురుగ
మోదపు జీవనము నిర్వివాదము నాకింక......ఎందుకంటే
నాన్నంటే నాకిష్టం,నాన్నకు నేనూ ఇష్టం

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...