AMBA VANDANAM-09
అంబవందనం-09 ************** వందే దుర్గతి నాశిని అనర్గళానందాయినీ జననీ భర్గాది దేవ వరదాం అభయదాం సర్గాదికృత్యమోదాం నిర్మదాం స్వర్గాది సౌఖ్యప్రదాం శుభదాం అపవార్గాది ఫలదాం భవపారదాం: దుర్గాం: కరవాల హస్తాం కరుణాలవాలాం వరశరన్నవరాత్రమహితాం అమలాం పరమహంస్యాదర్చితాం నిష్కళంకాం పరమాద్వైత శీలాం "దుర్గాం వందే దుర్గతి నాశిని." అమ్మవారిని స్తుతిస్తూ, కరవాల హస్తాం-కరుణాలయాం అని రెండు విభిన్న తత్త్వములను వినిపిస్తున్నారు.అమ్మవారు మన చర్మచక్షువులకు కరవాల హస్తము తో మాత్రమే కనిపిస్తున్నది .( మాయపొర తొలగనంతవరకు.) శుంభ-నిశుంభులు అమ్మను పొందుటకై రణమొనరించుచున్నారు.ఇది బాహ్యము. నిజమే.వారికి కావలిసినది అమ్మరూపము కాదు.అమ్మ దయాంతరంగము.జీవన్ముక్తి. అమ్మ కథలను చదువుచున్నప్పుడు మొదటి కథలో మథుకైటభులను సంహరించుతకు తాను ఆకాసమునుండి వెలువడి హరి యోగనిద్రను వీడునట్లు చేసినది.మన చివరి కథయైన శుంభనిశుంభులను సంస్కరించుటకు వానిని ఆధారముతో ఆకాశమంతా వ్యాపించునట్లు చేసి,తాను మాత్రము ఎటువంటి ఆలంబనను తీసుకొనకయే,తన హుంకారముతో భూమిని గట్టిగా తన్ని తాను సైతము ఆకాశమునకెగిరి యుద్ధము చేయుచున్నది. ఒక వి...