TIRUPALLIELUCHCHI-05

 


  తిరుపళ్ళి ఎళుచ్చి-05

  *****************

 "కృపా సముద్రం  సుముఖం త్రినేత్రం


  జటాధరం పార్వతీ వామభాగం

  సదాశివం రుద్రం అనంతరూపం

  చిదంబరేశం హృది భావయామి."


   సందర్భము

   *********

 ఎందరో మహానుభావులు స్వామి అవ్యాజ అనుగ్రహముతో వారి మనోఫలకములలో స్వామి రూప-గుణ-విభవములను దర్శిస్తూ-పులకరిరిస్తున్నారు.విచిత్రము వారిలో దాగి స్వామి కూడా నర్తిస్తున్నాడు.అదే కుండలినిని జాగృత పరుస్తూ వారికి సహస్రా సహస్ర దివ్యకాంతులను పరిచయము చేస్తున్నాడు.ఆనంద భాష్పములు స్రవిస్తుండగా వారు మైమరచి స్వామి వైభవమును కీర్తిస్తున్నారు.వారిలో దాగిన స్వామి వారితో పాటుగా అనిశము నాదమై నినదిస్తున్నాడు.అజపామంత్రమునుచ్చరిస్తూ ఆదిదేవుడు వారికి ఆలంబనగా నిలిచి ఆశీర్వదిస్తున్నాడు.పంచభూతతత్త్వమును పరిచయము చేస్తున్నాడు.అదియే పూదంగళ్ అని మాణిక్య వాచగరు ప్రారంభించిన ఎళుచ్చి ప్రారంభ పదము.వారిని దర్శించిన మన శివనోము నోచుకుంటున్న కన్నియలు మనకు ఆ లీలా విశేషములను అందిస్తున్నారు.

    ఎళుచ్చి.

    ******

పూదంగ తోరున్ నిన్రాన్ ఎనిన్ ఆళ్ళాళ్

పొక్కిలన్ వరవిలన్ ఎననినై పులవోర్

గీదంగళ్ పాడుదళ్ ఆడుదల్ ఆళ్ళాళ్

కేట్టరియోం ఉనై కణ్దరి వారై

శీదంకోళ్ వయల్తిరు పెరుంతురై మన్నన్

శిందనైక్కుం అరియా ఎంగన్మున్వందు

ఏదంగళ్ అరుదెమ్మై ఆండరుళుం పురియుం

ఎం పెరుమాన్ పళ్ళి ఎళుందరుళాయె


తిరువడి తొళుకో పోట్రి.

స్వామిపాదకాంతులకు మంగళం

***********

ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగరు సుక్షేత్రములుగా మారిన అంతరంగము కలిగినచెలుల సంభాషణమును వర్ణిస్తున్నారు.


తిరుపెరుంతురు మన్నన్,

తిరుపెరుతురునకు ప్రభువైన మా స్వామి,


శీదంగళ్ వయల్-మా మనోక్షేత్రములు భక్తి అను విత్తును నాటిన, పుష్కలముగా పంటను అందించు సుక్షేత్రములుగా మారినవని మాకు నీ పంచభూత తత్త్వమును

ఆళ్ళాళ్-విజ్ఞులు మాకు తెలియచేస్తున్నారు.


వారేమో ఆడుతున్నారు-పాడుతున్నారు.

గీదంగళ్ పాడుదల్-ఆడుదల్ అల్లాల్

వారి సంతోషమునకు కారణమును తెలిసికోవాలని మేము వారిని ప్రశ్నిస్తే?


పూదంగల్ తోరున్ నిండ్రాయ్

అని పంచభూతములుగా  నిండి యున్న నీ విభవమును గురించి కీర్తిస్తున్నారు.

ఆనందాశ్రువులు నిండిన నయనములతో నర్తిస్తున్నారు-కీర్తిస్తున్నారు.

వారు తన్మయత్వమును అనుభవిస్తున్నారు.అర్చిస్తున్నారు.ముందు తరములకు స్వామి తత్త్వమును అందిస్తున్నారు.అని చెప్పగానే


చెలి! నాదొక సందేహము.నిజముగా వారు స్వామిని దర్శించితిరా స్వామిని?


స్వామి అర్చామూర్తి నామ-రూప-గుణ వైభవములగురించి మరిన్ని విశేషములను తెలుసుకుందామని వారిని సమీపించి,ప్రశ్నించగా,

వారు బహిర్ముఖులై,

వారికి ఎందరోస్వామి వారికి అందించిన అనుభవములను-అనుభూతులను వివరించినారే కాని ప్రత్యక్షముగా వారును దర్శించలేదట.(నిరాకార సేవనము)


అయినప్పటికిని వారికి/ఇంద్రియములకు ప్రతి పరమాణువు స్వామిశక్తిగా కనపడుతున్నదట.(సర్వం శివమయము)

వారు నిశ్చలమనస్కులై ఇది స్వామిరూపము-ఇది స్వామి విభవము--ఇది స్వామి నివాసము అని స్వామి ఉనికిని పరిమితము చేయలేమని సర్వాంతర్యామితత్త్వమును వివరిస్తుంటే,

సెన్నియ అంజలి కుప్పినరొరుపాల్ -అందరును త్రికరణశుధ్ధిగా నమస్కరించి,ఇవన్నీ మనలకు పరిచయము చేయుచున్న పరమాత్మ ఎంతటి దయార్ద్ర హృదయుడో అని తలుస్తూ, శివనోమునకు తరలి వెళుతున్నారు.


ఈ రోజు మణిక్యవాచగరును ఆకర్షించిన సుందర ఉద్యానవనములో జరిగిన విశేషముల గురించి తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.

"ఇమైపొడుం ఎన్నెంజిల్ నీంగాదాన్ వాళ్గా"

పరమేశా!

నా హృత్పుండరీకమునందు కొలువై క్షణమైనను ననువీడని నీ పాదములకు శాశ్వత మంగళమగుగాక.

పరమేశుని లీలలు పరిపరివిధములు.

ఎంతటి అద్భుత దర్శనము.ఒక మహావృక్ష నీడలో అనంతతేజోరాశిగా అవతరించిన ఆదిదేవుడు.

క్రింద స్థిమిత చిత్తములతో స్వామి బోధనమును శ్రవణము

చేస్తున్న సకలసురలు.

సత్-చిత్-ఆనందము పర-వ్యూహ-విభవ దశలను అధిగమించి,అర్చామూర్తిగా ఆటను ప్రారంభించిన సన్నివేశము.

ఓం నమః శివాయ

ఐహికము తాను పక్కకు


       జరుగుతు ఆధ్యాత్మికమునకు మార్గము వేయుచున్నదా అన్నట్లుగా అడుగులను కదిలిస్తున్నాడు అటువైపునకు

హర్షాతిరేకముతో మాణిక్యవాచగర్.

/వాలిన భక్తి

స్వామి పాదపద్మములను ఆశ్రయించినది.అవ్యాజ వాత్సల్యము అనుగ్రహముతో ఆశీర్వదించినది.

కోవెల నిర్మాణమునకు బీజమువేసి కనుమరుగైనది కరుణామృతమును వర్షిస్తూ.

అంబే శివే తిరువడిగళే శరణం.

 ఏక బిల్వం  శివార్పణం.



Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI