Monday, January 29, 2018

TIRUPPAAVAI-19



కుత్తు విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్మేల్
మెత్తెన్ఱ పంచ శయనత్తిన్ మేల్ ఏఱి
కొత్తలర్ పూంగురల్ నప్పిన్నై కొంగైమేల్
వైత్తు క్కిడంద మలర్ మార్బా! వాయ్ తిఱవాయ్
మైత్తడంకణ్ణినాయ్! నీ ఉన్-మణాళనై
ఎత్తనై పోదుం తుయిలెర ఒట్టాయ్ కాణ్
ఎత్తనై యేలుం పిరివాత్తగిల్లాయాల్
తత్తువమన్ఱు తగవ్-ఏలోర్ ఎంబావాయ్
" నీళాతుంగ స్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం
పారార్థ్యం స్వం శృతిశతశిర స్సిద్ధమధ్యాసయంతీ
స్వాచ్చిష్టాయాం స్రజినిగళితం యా బలాత్ కృత్యభుఙ్క్తే
గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ:"-శ్రీ పరాశర్ భట్టర్.
ఓం నమో నారాయణాయ-19
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది
అమ్మ యదపై నిదురించు అచ్యుతుడు అందించుచున్న
"అంబరమే-తన్నీరే-శిఱే" మరియు పఱ వాయిద్యములో
గోపికలు మేల్కొలుపుతునున్న తాను మౌనముగానున్నదైన
"నప్పిన్నాయ్ వాయ్ తాల్తిరవాయ్" తల్లి పలుకే బంగారములో
శ్రీ పరాశర భట్టు స్తుతించు యశోద మేనకోడలైన
పూబంతి చేతనున్న నీళ ముఖ యశోకాంతులలో
అమ్మ పుట్టినింట ఏడుగురు అసురులు నిక్షిప్తమైన
ఆబోతుల స్వామి హతమార్చెనన్న ఆ పోతన స్తుతులలో
అతి పవిత్రమైన వ్రతము ఆచరింప రారె
ఆముక్త మాల్యద ఆండాళ్ అమ్మ వెంట నేడె.
భావము
మన గోపిక పర ఇస్తానని చెప్పి నీలాదేవి ఎదపై నిదురిస్తున్న స్వామిని,అమ్మ ఎంత పిలిచినా తలుపుతీయక పోగా,వస్తున్నా!తీస్తున్నా అని పలుకైనా పలికని నీలాదేవిని,శ్రీ పరాశర భట్టర్ చే చేతిలో పూబంతి ధరించి చిద్విలాసముగా ప్రకాశింపబడుతున్నావని స్తుతియింపబడే నీలను,స్వయంవర నియమమైన, నీలయింట నున్న ఏడు ఆబోతులను వధించి, నీలను పెండ్లాడాడన్న బమ్మెర పోతన స్తుతులను వినుచు,మనో నేత్రముతో చూడగలుగుతున్నది కనుక మనము దీనిని కేవలము సామాన్యార్థముగా పరిగణించలేము .స్వామి కరుణచే సామాన్యార్థము సం స్కరింపబడి సంకీర్తనముగా రూపుదిద్దుకుంటోంది.
స్వామి మనకు అనుగ్రహించేవి అంబరమే-వస్త్రములు,తన్నీరే-మంచినీరు,శిఱే-అన్నము.ఇది బాహ్యార్థము.శరీరాభివృద్ధికి ఇవి పోషకములు. కాని ఇహపర పోషకములు అంబరే-పూర్తిగా వ్యాపించిన( ఆకాశము) వేదములు.ఇవి అపౌరుషేయములు.ఎవరు వ్రాసినవి కావు.వేదమే ఋతము అదియే నిజము.వేదము అంబరమయితే దానిని వివరించే ఆచార్యులే మంచినీరు అదే జ్ఞాన తృష్ణను తీర్చే తన్నీరు.వారు నేర్పు మంత్రమే అన్నము.(శిఱే) అధ్యయనము చేసి పరమాత్మ తత్వమైన పరమపదమునకు పోవుటకు గల మార్గమే పఱి.ఈ నాలుగు చతుర్విధ పురుషార్థములు.వాని రూపమే అమ్మ చేతిలోని పూబంతి
నప్పినాయ్ అమ్మవారిని ముద్దుగా తమిళభాషలో పిలుచుకునే పేరు.అంటే లక్ష్మీదేవి.లక్ష్మీదేవి అంశలు మూడుగా విడివడి ఆదివారహునిని భూమాతగాను,(భూదేవి) శ్రీ రాముని సీతాదేగాను (శ్రీదేవి) శ్రీ క్రిష్ణుని నీలాదేవిగాను అనుసరించారు.నప్పిన్నాయ్ ని ఉత్తర భారతీయులు రాధా దేవిగా కొలుస్తారు. అమ్మ స్వామి ఆత్మైక స్వరూపులు.దేహములు రెండు కాని ఆత్మ ఒక్కటే.స్వామి నిదురించుట అంటే అంతర్ముఖమైనారు.స్వామి-అమ్మ అంతర్ముఖమైనారు కనుక అమ్మ నోరు తెరచి మాట్లాడుట లేదు అని మన గోపిక అర్థము చేసుకొనుచున్నదన్న తలపుతో నిమగ్నమైన నా మనసు, ఆండాళ్ అమ్మ వెంట నడచుచున్న గోపికలతో తన అడుగులను కదుపుచున్నది..
( ఆండాళ్ తిరు వడిగళే శరణం)

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...