MEEDHUSHTAMA SIVATAMA-05

 మీఢుష్టమ శివతమ-05

***************
న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రుని సేవింపలేడు.
నమ సస్పింజరాయ త్విషీమతే పథీనాం పతయే నమః.**********************
త్వరత్వరగాఎవరెవరు ఎటువంటి వారోపరికించి-పరిశీలించి-ప్రశ్నించి-పరీక్షించి పట్టికను తయారుచేసి ఆ రుద్రునికిస్తే వారికి గట్టిగా బుధ్ధిచెబుతాడు.
భవస్య హేత్యై జగతాం పతయే నమః
***************************
చేయకు మరి తాత్సారము అంటున్నది ఉరకలు వేస్తున్న ఉత్సాహం.
పార్కులో ఫలానావాడు కదా నన్ను ఉరిమి ఉరిమిచూసినది.ఉత్తమోత్తముడు.మొదట వాడిపేరే ఉండనీ పట్టికలో అనుకుంటూ చేరాడు వాడి ఇంటికి.వాడి గుమ్మము దగ్గరకు వెళ్ళాడో లేదో,
నమో రుద్రాయాతతావినే క్షత్రాణాం పతయే నమః.
గంభీరస్వరము ఆగండి! ఎవరు మీరు? ఇక్కడ మీకు ఏంపని?ఎందుకు వచ్చారు? ఉలికిపడి తలేత్తగానే తన కళ్ళను తానేనమ్మలేక పోయాడు? త్రిశూలధారియై రుద్రుడు వాని ఇంటిని కావలి కాస్తున్నాడు.నన్ను ఎప్పుడు చూడని వాడిలా గుర్తించనట్లు గద్దిస్తున్నాడు.
ఆగ్రహము కట్టలు తెచ్చుకుంటోంది.ఆ మాయావి మాటలకు.అవసరము తనది కనుక అయ్యా!నేను ఫలానా.మీరు కావలి కాస్తున్న ఫలానా వారితో పనుండి వచ్చాను.దయచేసి నన్ను లోనికి అనుమతించండి అన్నాడు వినయముగా.(తెచ్చిపెట్టుకున్న)
వీలు కాదంటున్నాడు రుద్రుడు.
బతిమలాడాడుసాధకుడు.
భంగపాటును అందించాడు రుద్రుడు.
చేసేదిలేక ఎగతాళి చేసినవాడి ఇంటికి బయలుదేరాడు ఏమవుతుందో అక్కడ అనుకుంటూ.ఎదురుగుండా రుద్రుడు.ఎంత వేడుకున్నా ఆమోదముద్రను అందించుట లేదు.పైగా నా యజమాని భద్రత నాకు ముఖ్యము అంటున్నాడు.వేళాపాళా లేదా అంటూ నన్నే వెళ్ళిపొమ్మన్నాడు.
.
ఎక్కడికెళితే అక్కడ ఇదే పరిస్థితి.పళ్ళు పటపట కొరుకుతు అసలు ఈ రుద్రుడు ఉన్నాడే...నేను సహాయము అడిగితే సరేనంటాడు.చిన్న మెలిక పెడతాడు.
మొన్నటికి మొన్న నేను వితరణగా వరములనిస్తానని "వికిరిద" వికిరిద అంటు కరములు జోడించి కీర్తిస్తున్నారంటు బీరములు పలికాడు.ఇప్పుడేమో నా పనికి అడ్డుపడుతున్నాడు అనుకుంటూ,సాగరతీరములో ఇంక నిన్ను నమ్మను గాక నమ్మను అని గట్టిగా అరుస్తున్నండగా
,గుట్టుచప్పుడు కాకుండా ఎదురుపడి రుద్రుడు ఏమి తెలియనివాడిలా,
తరిమివేద్దాము నీ శత్రువులను ఏది ఆ పట్టిక అంటు ఆతృతను నటిస్తూ చేయి ముందుకు సాచాడు.
ఆపు రుద్రా! ఆపు నీఆటలు-నీ మాటలు.సముద్రఘోష చిన్నబోయి మిన్నకుంది.
నిన్ను నమ్మిన తప్పుకు మంచి శాస్తే చేసావు.
బడాయి మాటలు నాకు-గడప కావలి వారికి.
ఇంక నీదారి నీది-నా దారి నాది.ఈ సముద్రమే సాక్షి అంటూ చేతిని ముందుకు సాచాడు ఒట్టువేస్తున్నట్లు.
గద్గదమవుతున్నది కంఠము.గంగను కురిపిస్తున్నాయి నేత్రములు.ఎదురుగ రుద్రుని రూపము తనను మరింత మోసము చేస్తూ మసకమసకగ.
సరే నీ మటే నామాట.నేను కాదనను.కాని,నాకొక చిన్న సందేహము.
నీ సందేహాలు నేను తీర్చాలా.వెళ్ళవయ్య వెళ్ళు.
ఇప్పుడే తీర్చొద్దులే.నీకోపం తగ్గినప్పుడు/చెప్పాలనిపించినప్పుడు
చెప్పుదువులే.
ఇంతకీ ఇప్పుడు నీవు ఒట్టువేసినది ఈ కడలి మీదనా/లేక పడిలేచే దాని కెరటము మీదనా?
అనునయిస్తున్నట్లుగా దగ్గరికి వస్తున్నాడు రుద్రుడు
అనుమానముగా రుద్రుని చూస్తున్నాడు సాధకుడు.
కదిలేవి కథలు-కదిలించేది కరుణ.
అణువు అణువు శివమే-అడుగు శివమే.
శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.
చిత్రంలోని అంశాలు: అగ్ని
నచ్చింది
వ్యాఖ్య
భాగస్వామ్యం చేయి

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI