Monday, November 30, 2020

MEEDHUSHTAMA SIVATAMA-14

 మీఢుష్టమ శివతమ-14

**********************
న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రునిసేవింపలేడు.
గుడిలో సుష్టుగా ప్రసాదము తిన్నాడు.గుర్రుపెట్టాలనిపిస్తోంది మనసుకు.
తెల్లవారదా,
రుద్రుని నాటకములు తేటతెల్లముకావా,
అనుకుంటూ,ఆవులిస్తూ,శయానేభ్యుడైనాడు సాధకుడు.
ఆసీనేభ్యుడు అంతటితో ఆగనిస్తాడా? సాగకుండా
,
వెండికొండపై అమ్మతో నిండుగా ఆసీనుడైఉన్నాడు.
వారి పాదపద్మముల చెంత ఎందరెందరో దివ్యపురుషులు సేవిస్తున్నారు.
సభాభ్యో-సభాపతిభ్యశ్చవో నమో నమః.
సంభ్రమాశ్చర్యములతో ఉక్కిరి-బిక్కిరి అవుతున్నాడు సాధకుడు.
దేవీ! రోజూ సంభాషించి వస్తుంటానే అతనే ఇతడు.చూసి-వెళదామని వచ్చాడు అంటున్నాడు రుద్రుడు అమ్మతో.
నిలదీద్దామని వస్తే-నిందిద్దామని వస్తే నా ముందరికాళ్ళకు బంధమేసాడు అనుకుంటు,చేసేదిలేక,
అమ్మకు నమస్కరించాడు.
అదికావాలి/ ఇది కావాలి అని అడుగనిస్తుందా ఆ అవ్యాజకరుణ. అంతకు మునుపే ఆప్యాయంగా,
ఏదైనా కావాలా నాయినా? అన్నది
.
మమకారానికి దాసోహమైన వెటకారము పలాయనం చిత్తగించింది.
తరిగిపోని ధాన్యరాశులు కావాలి అమ్మ.
అక్షితిశ్చమే-అక్ష్తుతశ్చమే
అర్థిస్తున్నాడు భక్తితో.
ఎటువంటి ఆహారము కావాలి? నాయినా!
( ఐహిక సంబంధమా/ఆధ్యాత్మిక సంబంధమా/
మనలో మాట.)
మా అందరికి ఆహారం కావాలి అమ్మా.
జైత్రంచమ-ఔద్భిద్యుంచమే.
సుక్షేత్రముగామారిన సాధకుని మనసులో మంచిభావములనే మొలకలు చిగురించి,తీగెలుగా పైకి పాకుచున్నవి.
మా అందరి ఆహారమునకు కావలిసిన ముడిసరుకులు-వడ్లు-యవలు-మినుములు-శనగలు-పెసలు-గోధుమలు-నువ్వులు-నీ వరి ధాన్యములు...
తథాస్తు అన్నది తల్లి తరగని దయతో.
నమ పూర్వజాయచ-పరజాయచ.
దేవీ! నీకీ సాధకుని సంగతి తెలియదు.అనుభవముతో చెబుతున్నాను.
చిరాకు వచ్చినప్పుడలా వచ్చి నీ మీద చిందేస్తాడు.
మగని మాటను గౌరవిస్తూ మారుమాటాడలేదు సర్వమంగళ.మందహాసము చేసింది.
అదే అదనుగా రుద్రుడు చూడు సాధకా!
మా ఇద్దరిది ఒకటే మాట.
ఇంతకావాలా? ఇంకా కావాలా? ఇంకా ఎక్కువ కావాలా? చాలా-చాలా-చాలా....కావాలా?
ఇప్పుడే అనుకుందాము ఒక మాట అన్నాడుచేతుల మధ్యనున్న దూరమును పెంచుతూ.
వివర్ణమయినది సాధకుని మనసు వింత అనుభవముతో.
" విభుచమే-ప్రభుచమే-బహుచమే-పూర్ణంచమే-పూర్ణతరంచమే.....
వేడుకుంటున్నాడు రుద్రుని సాధకుడు.
ఆడుకుంటున్నాడు వానితో రుద్రుడు.
కదిలేవి కథలు-కదిలించేది కరుణ.
అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.
శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.
చిత్రంలోని అంశాలు: అగ్ని
Lakshmi MV మరియు మోహన్ నాయక్ వాంకుడోత్
1 వ్యాఖ్య
నచ్చింది
వ్యాఖ్య
భాగస్వామ్యం చేయి

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...