Monday, November 30, 2020

MEEDHUSHtAMA SIVATAMA-19

 


మీఢుష్టమ శివతమ-19

 ********************


 నిన్ను విడిచి ఉండలేనయా-కైలాసవాసా

 నిన్ను విడిచి ఉండలేను కన్నతండ్రి నీవుకావ

 నన్ను విడిచి పారిపోకయా-


   "పృధివీచమ ఇంద్రశ్చమ-అంతరిక్షంచమ ఇంద్రశ్చమే-ద్యౌశ్చమ ఇంద్రశ్చమే"  వినిపిస్తోంది చమకములోని అర్థేంద్ర అనువాకము.


 ఈసారి భావమునుకూడ వివరిస్తున్నారు.భూమితో కూడివచ్చిన ఇంద్రుడు-ఆకాశముతో కూడి వచ్చిన ఇంద్రుడు-స్వర్గముతో కూడి వచ్చిన ఇంద్రుడు అంటూ.


  రుద్రా! ప్రతిసారి ఇంద్రశ్చమే-ఇంద్రశ్చమే అని అంటున్నారు.వీరందరితో పాటుగా తాను వెళుతున్నాడు.వారు మాత్రం ప్రత్యేకముగా కనిపించటములేదు.ప్రతిసారి తనను పేరుపెట్టి పిలుస్తేనే వస్తానన్నాడా ఏమిటి? అని రుద్రుని చెవిలో గుసగుసలాడాడు.


  "నమో బృహతేచ వర్షీయతేచ."


 దేశము-కాలము-వస్తువు అను మూడువిధములైన పరిమితులు లేనిది బృహత్ శబ్దము అదే బ్రహ్మము.


 గుణై వర్షీయతే.


  గుణములచే అధికముగా నొప్పువాడు.స్వరూపమును వేడుకగా ధరించువాడు అగు రుద్రునకు నమస్కారములు.



  ప్రారంభమైనది ప్రదర్శన.


 మిస్టర్.పృధ్వి గొప్పదనమును చెప్పనారంభించాడు నిర్దేశకుడు ఇంద్ర.


నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చవో నమః.






  సహనమునకు మారుపేరు మా పృథ్వి.మా యజ్ఞం సినిమా  లోని     ఏ, ఏ  సన్నివేశాలు ఎక్కడ-ఎక్కడ చిత్రీకరించాలో,ఏవి అనుకూలమో-ఏవి కాదో,సహజత్వమునకు భంగము రాకుండా ఉండేటట్లు వెతికి,వెతికి నిర్ణయిస్తాడు.వాటిని మరింత అందముగా మలచుటకు ఎంతటి శ్రమనైనా విసుగులేక భరిస్తాడు.( ఎంతైన సుగంధభరితము కద మనసు.)

  నమ ఉర్వర్యాయచ-ఖల్యాయచ


 అన్ని సస్యములతో నున్నది భూమి.ధాన్యములనుంచు భూమి ఖల.


  భూమియందు ధాన్యరూపమున పుట్టినవానికొరకు,

  ధాన్యమును నూర్చు కళ్ళమునందుండు గుంజ మొదలగు రూపమున నున్న రుద్రునకు నమస్కారములు.


  పొలము పండుట దైవశక్తికి,కళ్లమును నూర్చుట మానవ ప్రయత్నమునకు సంకేతములు.



 


   అసలు పృధ్వి లేకపోతేనేనెక్కడ? నా సినిమా ఎక్కడ?



     " నమో రుద్రాయచ ఆతతావినే క్షేత్రాణాం పతయే నమః."



    తొణకడంలేడు పృథ్వి.ఇంద్ర భుజముపై చేయివేసి వాడేనేను-నేనే వాడు అన్నాడు.


   నమస్సోమాయచ-రుద్రాయచ.



  ఆకాశ్ గారు అంటు చూసింది ఆ అమ్మాయి

.ఇంద్రగారిని అసలు మాట్లాడనీయటములేదు.గడగడ నాకొక స్నేహితున్నాడమ్మా.వాడి పేరు ప్రణవ్.వాడు నేను కలిసి పాటలు.నేపథ్య శబ్దములు మొత్తము శబ్దసహకారాన్ని అందిస్తాము.కాకపోతే ఇంద్రగారు ఎటువంటి పనిని కోరుకుంటున్నారో దానిని నూటికి నూరుశాతము ఇచ్చేందుకు సహకరిస్తాము.( ఎంతైన శబ్దస్వరూపముకదా)



 నమో మేఘ్యాయచ-విద్యుత్తాయచ.


  అందుకే మీ సినిమా చూస్తున్న ప్రేక్షకులు స్వర్గపు అంచుల్లో ఉన్న అనుభూతిని పొందుతున్నారు, అని అంటుండగా అవనిక కిందకు జారింది. పక్కకు తిరిగి రుద్రుని చూసుకుంటూ,



   చిక్కుకు పోయాడు నా చేతిలో అనుకున్నాడు సాధకుడు.

   చిక్కుకుపోయాడు ఇంద్రుని చేతిలో అనుకున్నాడు రుద్రుడు.


  కదిలేవి కథలు-కదిలించేది కరుణ.


 అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.


  శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.


   ఏక బిల్వం శివార్పణం.




No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...