Monday, November 30, 2020

MEEDHUSHTAMA SIVATAMA-10

 మీఢుష్టమ శివతమ-10

*******************
న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రుని దర్శించలేడు.దయను పొందలేడు.
దొంగవ్యాపారి ఆ రుద్రుడు.కనుకనే దివ్యమైన శరీరమును ఒక చిన్న సంఖ్యతో పోలుస్తున్నాడు.పైగా ఒకే ఒక్కసారి ఉపయోగపడేది.అదికూడ కొన్ని సెకనుల వరకే.ఒట్టి పిచ్చివాడు రుద్రుడు.
నమో హరికేశాయోపవీతనే పుష్టానాం పతయే నమః.
ఇంక రానేరానన్నాడు వెళ్ళిపోతు.కాని ఎంతవరకో ?చెప్పలేము.రుద్రుడు చెప్పలేదు.
అమ్మో ఈసారి రుద్రునికి చిక్కనే చిక్కకూడదు
.ఒకవేళ చిక్కినా బిక్కముఖం అసలు వేయగూడదు.
తనతో ఆడుకునే ఆలోచనలను నెట్టుకుంటు పనులు చుట్టపెట్టుకుందామని లింగని ఇంటివైపుగా వెళుతున్నాడు.వాడెలాగో చాలారాత్రి వరకు నగలను చేస్తూనే ఉంటాడు.
అసలే కార్తికం.అందులో ప్రదోషం.
" హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచపతియే నమో నమః."
ఆలయములో నుండి వినిపిస్తున్నది.
బంగారు బాహువులవాడట రుద్రుడు.అది నిజమేనని నమ్మి,
"హిరణ్యంచమే" అని బంగారమును అర్థిస్తున్నది చమకము.
సాధకుని ప్రశ్నిస్తోంది సహవాసము
ఏమిటా హిరణ్యము?
మేలిమి అపరంజియా? లేక
మెరుస్తున్న ఆభరణమా?
ఉన్న పాటుగా ఉలిక్కిపడ్డాడు సాధకుడు.
ఉన్నదాని ఉనికిని తెలుసుకోనీ అనుకున్నాడు రుద్రుడు.
రానేవచ్చింది లింగయ్య ఇల్లు.వసారాలో కూర్చున్నాడు కంసాలిగా కర్తవ్యముతో.
"నమో కులాలేభ్యో కర్మారేభ్యేశ్చవో నమో నమః."
అయ్యా! తమరా రండి బాబు.కూర్చోండి అంటు కుర్చీని చూపించాడు.
సాధకుని రాకకు కారణమును అడిగే సాహసమును చేయలేక,అయ్యా!
తమరు అనుమతిస్తే నా పనిని పూర్తి చేసుకుంటాను అన్నాడు వినయముగా.
అయ్యో లింగా! అలాగే కానీ.నీ నైపుణ్యమును చూడాలనే వచ్చాను అన్నాడు సాధకుడు.
కాసులహారము కళకళలాడుతున్నది వాడిచేతిలో.కనికరము లేకుండా దానిని నిప్పులో వేసి కరిగించేసాడు.కలవరపడుతున్నాడు సాధకుడు దానిని చూస్తు.చిన్ని బంగరు ముద్దగా మారింది ఆ హారము.దానికి మునుపటి కళలు లేవు.రూపములేదు.కాసులహారమను నామములేదు.
అంతా అయోమయముగా ఉంది సాధకునికి.అయినా మౌనముగానే ఉన్నాడు ఆ తరువాత లింగని పనిని చూడటానికి.
లింగడు ఆ ముద్దను ఒకద్రావకములో ముంచి,దాని నుండి మిరియపు గింజంత ఎర్రని ముద్దను వేరుచేసాడు.
మిగిలిన ముద్దను ఒక చిన్న గిన్నెలో పడేసాడు.ఆశ్చర్యమును ఆపుకోలేని సాధకుడు,
అదేమిటి లింగా చక్కని కాసులహారమును ,........
అవును చిన్న ముద్దచేసాను. ఆ పక్కవీధి దొరసానిది ఈ మేలిమి.ఆమెకు కంకణములు కావాలట.కాసులహారము వద్దట.ఆ పనిని నన్ను చేయమంది.
నా చేతి లోని ముద్ద ఇప్పుడు ఏమవుతుందో చూడండి అంటూ నిప్పులో కరగపెడుతున్నాడు.సుత్తితో కొడుతున్నాడు.మెత్తపడుతు వ్యాపిస్తున్నది ఆ పుత్తడి.కొంత రాగిలోహమును తనలో కలుపుకుంటున్నది కంకణముగా మారడానికి.
ఇప్పుడు చూడండి ఆ పసిడి ముద్దను.వృత్తాకార రూపమును-కంకణము అను నామమును ధరించినది.నగిషీలు చెక్కుకుంది.నవరత్నములను పొదవుకుంది.
మేలిని బంగారము యజమాని.కాసులపేరు-కంకణములు సేవకులు.ఎవరిని చూడాలనుకుంటే యజమాని వారే వస్తారు.ఒద్దనుకుంటే చాటున కనబడకుండా ఉంటారు.
ఆహా ఆత్మ మేలిమి పుత్తడి-శరీరము ఆభరనములు.
ఆత్మకు ఉపాధుల అవసరములేదు.కాని ఉపాధి ఆత్మలేకుండా ఉండలేదు.అర్థమైనది పూర్తిగా.
ఒక వేళ రుద్రుడు అడిగాడే అనుకో తడుముకోకుండా చెప్పేస్తా ,మంచినీళ్ళు తాగాలనిపిస్తోంది సాధకుని ఎందుకంటే రేపు రుద్రుని ముప్పతిప్పలుపెట్టి మూడుచెరువుల నీరు తాగించాలిగా అనుకుంటున్నాడు తనలో.
దాహముగా ఉంది అన్నాడు లింగనితో.అయ్యా! అక్కడ మూల కూజాఉంది.నాచేయి శుభ్రముగాలేదు.కాస్త వెళ్ళి,మంచినీళ్ళు తాగండి అని అన్నాడు మర్యాదగా.
కదిలాడు నీరుతాగుటకు సాధకుడు.
కనిపించాడు వాడికి నిద్రిస్తూ లింగడు
కదిలేవి కథలు-కదిలించేది కరుణ
అడుగు అడుగు శివమే-అణువు అణువు శివమే.
శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం
.
చిత్రంలోని అంశాలు: అగ్ని
నచ్చింది
వ్యాఖ్య
భాగస్వామ్యం చేయి

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...