Monday, November 30, 2020

MEEDHUSHTAMA SIVATAMA-01

 మీఢుష్టమ శివతమ-01

*******************
న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రుని అర్చించలేడు.
ప్రియ మిత్రులారా,
శివానుగ్రహము అర్థము కానిది అయినప్పటికిని అద్భుతమైనది.అది అట్టడుగున నున్న వానిని గట్టిగా పట్టుకుంటుంది.మత్తుకళ్ళను తెరిపిస్తుంది.కొత్తదనమును చూపిస్తుంది.అవసరమైతే రూపమును ప్రకటించుకుంటుంది.మనలను సందర్శింపచేస్తుంది.సంభాషిస్తుంటుంది.సన్నుతింపచేస్తుంది.
అంతటితో ఊరుకోదు.మనలో మాయలో ముంచి వేస్తుంది.నిందింపచేస్తుంది.నిలదీసేటట్లు చేస్తుంది.ప్రేమతో నిలకడతనమును నేర్పుతుంది.మనుగడకు అర్థమును తెలుపుతుంది.
పరమాత్మ ప్రకటనములు-ప్రదర్శనములు-ప్రహసనములు పరిపరివిధములుగా ఉన్నప్పటికిని,పరమార్థమునకు గమనములే.గణనీయములే.
రుద్రచమకము సెలవిచ్చినట్లు ,
" కృష్ట పశ్యంచమే-అకృష్ట పశ్యంచమే" అని అకృష్టపశ్యంచమే అనగా బీడునేల-దున్నని నేలను-కృష్తపశ్యముగా మార్చదలచి,నా హృదయములో తనకుతాను ప్రకటించుకొని,నన్ను సంస్కరించు కంకణధారియై,కురిపించుచున్న కరుణవర్షమే" మీఢుష్టమ శివతమ." అను ప్రసాద గుళిక.
నా ఈ దుస్సాహసమునకుకర్త-కర్మ-క్రియ అన్ని " గిరిశంచ అభిచాకశీ"
అదేనండి పెద్దలు చెప్పినట్లు,
1 గిరియందుండి ప్రకాశించుచున్నవాడు.
2.వేదములందుండి మోదమునందించువాడు.
3.ఇచ్చినమాటయందుండి వరములను వర్షించువాడు.
వరములను ఒకటికాదు-రెండుకాదు-కొన్ని కాదు-సంపూర్ణముగా వర్షిస్తాడు.అదేవిధముగా సాధకులకు ఆడ్డంకులను కలిగిస్తే వారిపై బాణములను (ఇషు) అధికముగా వర్షిస్తాడు ఉగ్రుడై.
ఏ విధముగా కుమ్మరి తనదగ్గరనున్న (తనలోనే) మట్టి-సారెలతో తన ఇష్టముగా కొత్తరూపములను ప్రకటిస్తూ,వాటికి కుండ-కూజా-మూకుడు-దీపము అంటూ నామరూపలను-నానా రూపములను ప్రకటించి,మట్టినివాటిలో పొదివి,తాను మాత్రము కనిపించకుండ దూరముగా ఉంటాడో,అదే విధముగా ఒక్కొక్క సరి రెండురూపములుగా సాధకుడు-రుద్రుడు గా ప్రకటితమగుతు,సాధకుని సందేహములను వెలిబుచ్చుతూ,రుద్రునిగా సందేశములను తెలియచేస్తూ.సరదా అయినదనుకోండి అమాయకముగా నటిస్తూ,అర్థము కానట్లు ప్రశ్నిస్తూ,అడుగడుగున అనుసరిస్తూ-అనుకరిస్తూ అన్నీ తానవుతాడు.
కాని,నా అహము అణిగి-మణిగి దానిని యదాతథముగా మీతో పంచుకోనిస్తే నేను ధన్యురాలినే.నన్ను దాసోహము చేసుకున్న అది మధ్యలో తనపని తానుచేసుకుంటూ పోతుంది.అసలురూపుకు కొసమెరుపులు దిద్దుతానంటు ముసిముసినవ్వులతో కొసరికోసరి తప్పులు వడ్డిస్తుంటుంది.మీరు పెద్దమనసుతో నాలోపములను సవరించి,నన్ను ఆశీర్వదిస్తారని,శివునియానగా మీముందుంచుతున్నాను.
కదిలేది ప్రపంచం-కదలనిది పరమాత్మ.
అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.
శివానుగ్రహముతో రేపుకలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.
చిత్రంలోని అంశాలు: అగ్ని, 'ARTISWELL' అని చెప్తున్న వచనం
Udaya Lakshmi మరియు Lakshmi MV
2 వ్యాఖ్యలు
నచ్చింది
వ్యాఖ్య
భాగస్వామ్యం చేయి

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...