imdra imdra

 


 మీఢుష్టమ శివతమ-19

 ********************


 నిన్ను విడిచి ఉండలేనయా-కైలాసవాసా

 నిన్ను విడిచి ఉండలేను కన్నతండ్రి నీవుకావ

 నన్ను విడిచి పారిపోకయా-


   "పృధివీచమ ఇంద్రశ్చమ-అంతరిక్షంచమ ఇంద్రశ్చమే-ద్యౌశ్చమ ఇంద్రశ్చమే"  వినిపిస్తోంది చమకములోని అర్థేంద్ర అనువాకము.


 ఈసారి భావమునుకూడ వివరిస్తున్నారు.భూమితో కూడివచ్చిన ఇంద్రుడు-ఆకాశముతో కూడి వచ్చిన ఇంద్రుడు-స్వర్గముతో కూడి వచ్చిన ఇంద్రుడు అంటూ.


  రుద్రా! ప్రతిసారి ఇంద్రశ్చమే-ఇంద్రశ్చమే అని అంటున్నారు.వీరందరితో పాటుగా తాను వెళుతున్నాడు.వారు మాత్రం ప్రత్యేకముగా కనిపించటములేదు.ప్రతిసారి తనను పేరుపెట్టి పిలుస్తేనే వస్తానన్నాడా ఏమిటి? అని రుద్రుని చెవిలో గుసగుసలాడాడు.


  ప్రారంభమైనది ప్రదర్శన.


 మిస్టెర్.పృధ్వి గొప్పదనమును చెప్పనారంభించాడు నిర్దేశకుడు ఇంద్ర.


  సహనమునకు మారుపేరు మా పృథ్వి.మా యజ్ఞం సినిమా ఏ 

  ఏ  సన్నివేశాలు ఎక్కడ-ఎక్కడ చిత్రీకరించాలో,ఏవి అనుకూలమో-ఏవి కాదో,సహజత్వమునకు భంగము రాకుండా ఉండేటట్లు వెతికి,వెతికి నిర్ణయిస్తాడు.వాటిని మరింత అందముగా మలచుటకు ఎంతటి శ్రమనైనా విసుగులేక భరిస్తాడు.( ఎంతైన సుగంధభరితము కద)


   అసలు పృధ్వి లేకపోతేనేనెక్కడ? నా సినిమా ఏక్కడ?


     " నమో రుద్రాయచ ఆతతావినే క్షత్రాణాం పతయే నమః."


    తొణకడంలేడు పృథ్వి.ఇంద్ర భుజముపై చేయివేసి వాడేనేను-నేనే వాడు అన్నాడు.


   **********************


  ఆకాశ్ గారు అంటు చూసింది ఆ అమ్మాయి.ఇంద్రగారిని అసలు మాట్లాడనీయటములేదు.గడగడ నాకొక స్నేహితున్నాడమ్మా.వాది పేరు ప్రణవ్.వాడు నేను కలిసి పాటలు.నేపథ్య శబ్దములు మొత్తము శబ్దసహకారాన్ని అందిస్తాము.కాకపోతే ఇంద్రగారు ఎటువంటి పనిని కోరుకుంటున్నారో దానిని నూటికి నూరుశాతము ఇచ్చేందుకు సహకరిస్తాము.


  అందుకే మీ సినిమా చూస్తున్న ప్రేక్షకులు స్వర్గపు అంచుల్లో ఉన్న అనుభూతిని పొందుతున్నారు, అని అంటుండగా అవనిక కిందకు జారింది.


   చిక్కుకు పోయాడు నా చేతిలో అనుకున్నాడు సాధకుడు.

   చిక్కుకుపోయాడు ఇంద్రుని చేతిలో అనుకున్నాడు రుద్రుడు.


  కదిలేవి కథలు-కదిలించేది కరుణ.


 అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.


  శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.


   ఏక బిల్వం శివార్పణం.


  

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI