Monday, March 6, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRADAYAM(GUHYAM-SANATANAM)-04

 రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ ।

యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ॥ 3 ॥


 ప్రస్తుత శ్లోకము ఒక విధముగా ఫలసృతి అని భావిస్తారు.
 ఇందులో గుహ్యం-సనాతనం అని శ్లోకము ద్వారా స్తోత్ర వశేషము చెప్పబడినది.
 మననాత్ త్రాయతే మంత్రం-వేదవాక్యము.
 అగస్త్యుడు రామునకు అదిత్యహృదయ మంత్రమును ఉపదేశించాడు అనుట మంత్ర మర్యాదను పాటించమనుకోవచ్చును.
 ఆది-అంతములేని నిత్యనూతన తత్త్వమే సనాతనము.
 ఆదిత్యహృదయ స్తొత్ర పఠన ఫలితము కేవలము శ్రీరామ చంద్రునికి మాత్రమే కాదు సర్వులకు-సర్వకాల సర్వావస్థలయందును సంస్కరించునది అని చెప్పకనే చెప్పబడినది.
 అంతే కాదు ఒక్క శత్రువును సంహరించునది మాత్రమే కాదు
 సర్వన్-అరీన్-సర్వశత్రువులను అనగా 
 కామ-క్రోథ-లోభ-మోహ-మద-మాత్సర్యములను అంతరంగశత్రువులను-బాహ్య శత్రువులను హరించివేస్తుంది.
  అంతే కాకుండ
 వత్స-అను వాత్సల్య పూరక సంబోధనము జరిగినది.
 వత్స అను సబ్దమునకు గోమాత యొక్క లేగ.గోవు తాను సాకాహారి.అయినప్పటికిని తన నుండి జన్మించిన బిడ్దను ఆవరించి యున్న నిషిద్ధమును ప్రేమతో శుభ్రం చేస్తుంది.దానికి స బాహ్య-అభ్యంతర శుచిని ప్రసాదిస్తుంది.
 శ్రీరాఘవం-ఆజానుబాహుం అన్నది మనము వింటూనే ఉంటాము.
 రామ-రామ మహాబాహో అన్న విశేషము కూడా వినిపిస్తుంది.
 మహా అవధులు లేని భుజపరాక్రమము కల శ్రీరామ
 నీవు రణ్ అమున చింతాక్రాంతుడవై ఉండుట తగదు.
 జగన్మాత యైన సీతను అయోధ్యకు తీసుకుని వెళ్ళవలసిన సమయమాసన్నమైనది.
 రామ-ఓ భగవానుడా!
 రామ-దుష్టశిక్షన-శిష్ట రక్షణ వ్రతముగా గల అవతారమా
 శ్ర్ణు-వినుము.
 నేను ఉపదేశించుచున్న స్తోత్రమును విని-పఠించుము.
  ఇది మానవధర్మాచరణము.ఆచరించి-అనుగ్రహపాత్రుడవు కమ్ము అంటూ రాముని కార్యోన్ముఖునిగా ఉత్తేజపరచిన శ్లోకమిది.
 తం సూర్యం ప్రణమామ్యహం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...