Sunday, August 2, 2020

paalutaagi



ఓం నమః శివాయ-78
 *********************

 పాలుతాగి విషము కక్కు పాముమీది మోజుతో
 పాలకడలి విషము మింగ పావుగా మారావు

 పచ్చి అబధ్ధాల పుర్రెలమీది మోజుతో
 పరమేష్టి పలుకులలో దొంగగా మారావు

 సూర్య-చంద్ర-అగ్నుల ముక్కంటిని నేననే టెక్కుతో
 అగ్గికన్ను తెరువలేని అసహాయుడవయ్యావు

 గంగను బంధించిన వాడిననే గర్వముతో
 కొంచమైన దించలేని నంగనాచివయ్యావు

 పదహారవ చంద్రకళమీది పరమప్రీతితో
 గ్రహణము తొలగించలేని ఘనుడవు నీవయ్యావు

 గొప్పపనులు నావంటూ పప్పులో కాలేస్తావురా
 ఒక్కసారి గమనించరా ఓ తిక్కశంకరా.

శివునికి పాములనుఆభరణములు గ ధరించుటపైగల ప్రీతి విషభక్షకునిగ మార్చినది.తుంచిన బ్రహ్మ పుర్రెలపైగల మోహము బ్రహ్మచే దొంగగా నిరూపింపచేసినది.వాటిని కనపడేటట్టుగా ఉంచుతాడేకాని దాచిపెట్టడము తెలియనివాడు.వృధ్ధిక్షయము అతీతమైన పదహారవ చంద్రకళను ధరించాననుకుంటాడే కాని గ్రహణమును ఆపలేని అసమర్థుడనుకుంటునారనుకోడు.గంగను బంధించిన మొనగాడను నేనేనను నంగనాచి కబుర్లు చెబుతాడు కాని కొంచము సైపైన దానిని కిందకు దించలేనని చెప్పడు.గొప్పపనులు తనవని అనుకుంటూ దోషిగా నిరూపించబడతాడు.
చంద్రకళనుధరించాననుకుంటాడే కాని గ్రహణ బాధను తొలగించలేడు.అగ్గిని కన్నుచేసి అదుపులో పెట్తాననుకుంటాడు కాని అది తెరువలేక బాధపడుతో0దన్న విషయాన్ని గ్రహించలేడు.అవి కుర్రో-ముర్రో అంటుంటే వాటి సమస్యలను పరిష్కరించలేని అసమర్థుడు శివుడు-నింద.

 ఆభరణము నమః శివాయ-ఆదరణయు నమః శివాయ
 చింతయు నమః శివాయ-నిశ్చింతయు నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ


గ్రహణము అంటే స్వీకరించుట గ్రహించుట అని పెద్దలు చెబుతారు.రాహుకేతు గ్రహములను ఛాయగ్రహములంటారు.ఇవి భూమికి ఉపగ్రహము అయిన చంద్రుడు రవి మార్గమును ఖండిస్తు చేయు పయనములోని ఉత్తర దక్షిణ బిందువులు.భూమి సూర్యుని చుట్టు తిరుగుతు,తనచుట్టు తాను తిరిగే ప్రక్రియలో సకల చరాచర జీవరాశులకు అవసరమగు ఔషధ తత్త్వములను కొంతసేపు చంద్రునికి దగ్గరగా జరిగి స్వీకరిస్తుందట.మానసిక ప్రశాంతతకు కూడ తోడ్పదేటట్టు చేస్తుందట.భూమి ఈ గ్రహణ సమయములలో సౌరశక్తులను స్వీకరించి శారీరక పెరుగుదలను,చంద్ర తత్త్వమును గ్రహించి మానసిక మెరుగుదలను అందించుటకు కొద్దిసేపు మాత్రమే దగ్గరగా ఉండే విధానమును పరమేశుడు ప్రవేశపెట్టినాడట.విజ్ఞులు నా అభిప్రాయము తప్పయిన క్షమించి,సరైన వివరణను అందించగలరు.ధన్యవాదములు.


" ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం
  భిత్వామహాబలిభిరీశ్వర నామ మంత్రైః
  దివ్యాశ్రితం భుజగభూషణ ముద్వహంతి
  యే పాదపద్మ మిహతే శివతే కృతార్థః"

     శివానందలహరి.

  శివా నీ పాదపద్మము నిధి వంటిది.దానిని నీ ధ్యానమనే అంజనముతో చూచి,చీకటిగా నున్న స్థానమును నీ నామమనే మహాబలశాలుల ద్వారా ఛేదించి,దేవతలు ఆశ్రయించగా,సర్పములు నిన్ను చుట్టుకొనగలిగినవి అవి ఆభరణముగా అలరారు భాగ్యమును పొందించినది వాటికి నీపై కల అచంచల  కాని మభక్తియేరొక్కటి .కాదు.అవ్యాజ కరుణామూర్తి,నీ పాదనిధిని పొందగలుగు భాగ్యమును ప్రసాదింపుము.

 ఏక బిల్వం శివార్పణం.


























No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...