AALO REMBAAVAAY-08

       పాశురము-08

      ************

  గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,అనుగ్రహించినంతమేరకు పాశురమును అనుసంధానము చేసుకుందాము.



 కీళ్వానం వెళ్ళెండ్రు ఎరుమై సిరువీడు

 మేయాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైకళుం

 పోవాన్ పోగిన్రారై పోగామల్ కాత్తు

 కూవువాన్ వందునిన్రోం కోగులం ఉడయ

 పావాయ ఎళుందిరాయ్ పాడి పరై కొండు

 మావాయ్ పిళందనై మల్లనె మాట్రినాయ్

 దేవాదిదేవనై శెన్రునాం సేవిత్తాల్

 అవావెన్రు ఆరాయంద్రు అరుళేలో  రెంబావాయ్.

  ఓం నమో నారాయణాయ

  ********************

 తెల్లవారుచున్నది.తూరుపున వెలుగురేఖలు కనబడుచున్నవి.పశువులు చిరుమేతకు తరలినవి.

దేవాదిదేవుని నోమునకు వెళ్లుచున్నవారిని/వెళ్లుటకు సిద్ధమగుచున్నావరిని,కొంతసమయము నిలువమని మేము నిన్ను మేల్కొలుపుటకు వచ్చి,నీ గుమ్మము ముందర నిలబడి నిన్ను పిలుస్తున్నాము.అన్నది వాచ్యార్థము.

 కోగులం ఉడయ-కుతూహలము కొత్తచిగురులు తొడుగుచుందగా

  1.తూరుపుదిక్కు చీకట్లను పారద్రోలుచు వెలుగు రేఖలను ప్రసరించుటకు కుతూహల పడుచున్నది.

  2.పశువులు (ఎరుమై) కొంచముసేపు బంధములను విదనాడి పచ్చికను మేసి వచ్చుటకు కుతూహలపడుతున్నాయి.


  3.పడుచులు నోముస్థలికి చేరుటకు కుతూహలపడుచున్నారు.మిక్కుళ్ళ-మిక్కిలి కుతూహలముతో నున్నారు.

 4.మావాయై-గుఱ్ఱముతో  పోల్చబడి  పరుగులుతీయు మా మనస్సులు-మల్లయుద్ధవీరులతో పోల్చబడు మా ఉపాధి అహంకార-మమకారములు నీ చే పరిహరింపబడుటకు కుతూహలముగా నున్నాయి.

  వాటి కుతూహలమునకు కారణము "సిరువీడు" చిన్నమేత.

.

   బాహ్యమునకు గోదమ్మ సనాతనమును తెలిసినదైనప్పటికిని సఖులను మేలుకొలుపు విషయములో గొల్లెతలకు చిరపరిచితమయిన సంకేతములనే చెప్పుచున్నది.


  ఏడవ పాశురములో ఏ విధముగా చల్లచిలుకు పడతుల నిత్యానుష్ఠానమును గుర్తుగా చెప్పినదో,అదేవిధముగా ప్రస్తుత పాశురములో "సిరువీడు" అన్న ప్రక్రియను ఉదాహరణముగా చెప్పినది.


  స్వల్పకాలిక విడుదల.భవబంధములనుండి/భవసాగర్మునుండి.

 గోకులములో తెల్లవారగనే గోవుల బంధములను తొలగించి చిన్నమేతకు కొంచముసేపు పచ్చికవైపునకు తరలిస్తారట.అక్కడ అవి పరందన-అంతటా వ్యాపించి మేతను మేస్తాయట.తిరిగి వచ్చి పాలను సమృద్ధిగా వర్షిస్తాయట.

 గోదమ్మ-గోపిక సంభాషణములో తూరుపు  రేఖలు చూడు అనగానే అవి స్వామినిదర్శించబోవు మీ ముఖబింబములనుండి ప్రసరించు సంతోషము అని చెప్పబడినది.

  గోకులములోని పశువులు నల్లని ఆవులు-గేదెలు పచ్చికపై వ్యాపించి మేయుచున్నప్పుడు చీకటి తరిమివేయబడినట్లున్నదనగానే,

 లోపల నున్న గోపిక దానిని ఖండిస్తూ,అది ఇంకా తెల్లవారలేదన్న దిగులుతో మీ ముఖమునుండి వచ్చున్న విచారము అని చెప్పినది.

 నర్మగర్భసంభాషనముతో గోదమ్మ ధర్మబోధ చేసినది.

 కీణ్వానం-తూరుదిక్కు

 వెళ్లెండ్రు-తెల్లబడినది.

 ఎండ్రు-ఎక్కడ చూసిన ఉషోదయమే.ఇది స్థూలము.

   ప్రతి మనస్సు తమో-రజో గుణములను వీడి శుద్ధ సత్వముతో నిండినది.

 దానికిసమర్థనమే

 మావాయ్ పిళందనై మల్లనె మాట్రినాయ్

 మనస్సు-శరీరము నిష్కల్మషమై నోమునకు సిద్ధముగా నున్నది.

  లోపలి నున్న గోపిక మరింత స్పష్టతను కోరుకుంటున్నదో/మదనమోహనుని వీడి రాలేకయున్నదో,బయటకు రాలేదు.

 మనమీది అనుగ్రహముతో గోదమ్మ గోపికలతోపాటుగా మనలకు కూడా చిరువీడు గురించి చెప్పుచున్నది.

 చిరువీడు-పెరువీడు కేవలము పశువులకు మాత్రమేనా?చేతనలనుద్దేశించినదా అంటే అందరికి అన్వయించుకోవలసినది.

 సంసారమనే బంధముతో కట్టివేయబడి ఉన్న చేతనులారా! జాగరూకులు కండి.అజ్ఞానమును తరిమివేసే జ్ఞానమనే తూరుదిక్కును చూడండి.

 చిన్న అవకాశమును కల్పించుకోండి మీ ఉపాధిని ఉద్ధరించుకొనుటకు.కొంచముసేపు,

 పరంద-వ్యాపింపచేచి-విస్తరింపచేసి

    వేనిని?

 మీ దశేంద్రియములను దాసులను చేసి భగవదనుభవమును భాగ్యమును ఆస్వాదించండి.అందరికి పంచండి.



 అర్చనయో,ఆలాపనయో,భోగమో,నామమో,పురాణ్ అమో,హరికథయో,, భజనమో,అలంకారమో చేయండి.

 అదియును స్వధర్మమును విడనాడక .తెలిసినవారు 

 కనుక గొపికలు నోమునకు కుతూహలముతో,

 పోవాన్-ఇప్పటికే చేరారు.

   మరికొందరు

 పోగిన్రారై-వెళ్ళుచున్నారు


 పోగామల్-వెళ్ళుటకు సిధ్ధమగుచున్నారు.

 ఆ విధముగా నున్న మిక్కుళ్ళ పిళ్ళైగళుం

   మిక్కుటముగా నున్న గోపికలను

 కాత్తు-కొంచముసేపు నిలువమని చెప్పి,నిన్ను

 కూవువాన్ వందు-పిలుచుటకు వచ్చి

   నీ ఇంటిముందర

 నిన్రోం-నిలబడియున్నాము.

 నోముస్థలికి చేరిన-చేరబోవుచున్న-చేరుటకు సిద్ధమగుచున్న పిల్లలు,అనగా 

 మన మనస్సులో చెలరేగు వివిధ అనుకూల-ప్రతికూల భావముల సంఘర్షణలే  మిక్కుళ్ళ పిళ్ళైగళుం..కొన్ని సత్వము వైపునకు పరుగులు తీయిస్తుంటే మరికొన్ని తమోగుణమును తరలి రామంటుంటాయి.వాటిని సవరించుకుని,వ్రతమునకు సంసిద్ధము చేసుకొని,


 వందోం-వచ్చి


 నీ ఇంటిముందు


 నిన్రోం నిలబడి 


 కూవువాన్-నిన్ను పిలుస్తున్నాము.నిదురలేచి కదలివచ్చుచున్న గోపికలతో 

   పాటుగా  స్వామిని సంకీర్తించి పరను పొందుటకు                      మనలను సైతము నోము ,


సిరువీడు-చిన్న విడుదల కు తీసుకుని వెళుతున్న,

 ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.




 




  

.



Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)