Saturday, November 2, 2019

Eka bilvam SivaarpaNam

నః ప్రయచ్చంతి సౌఖ్యం-07

" ఓం తస్కరాణాం పతయే నమః"

********************************

అదుపుతప్పుచున్న అరిషడ్వర్గములను దోచు

పెద్ద దొంగ ఒక్కడే! దిక్కొక్కడే.

దొంగ ఒక్కడే

దేవుడు-జీవుడు ఒక్కడే

ధర్మము-మర్మము తానొక్కడే.

లోకాన దొర కాదు దొంగవని చాటాను

నా పాపరాశులన్నీ దొంగల్లే దోచేశావు

అని స్తుతింపబడిన మహేశ్వరుని చోరకళా విశేషములను తెలిసికొనుటకు ప్రయత్నిద్దాము.

" భగవంతుడు-భక్తుడు ఇద్దరు దొంగలే"

దొంగలరూపములో నున్న ఈశ్వరచైతన్యమునకు నమస్కారము.ఈశ్వర చైతన్యము చర్మచక్షువులకు కానరాకుండా,సకలచరాచర జీవరాశులయందు దాగియుండి వాటిని శక్తివంతముగా ప్రకటించుచున్నది కనుక ఈశ్వరుడు గుప్తచోరుడు.

రుద్రుడు "స్తేనానం పతి". గుప్తచోరుడు.మనకు దొరకకుండ రహస్యముగా మనలోనే దాగియున్నాడు.నమో నమః.

" కకుభాయ విహంగినే స్తేనానాం పతయే నమః."

ఉభయ నమస్కార గ్రహీత అయిన మన స్తేనాపతికి అనగా రహస్యపు దొంగలకు నాయకుడైన వానికి స్వజాతీయాభిమానము ఎక్కువే.

ఏ వికారములేని పరమాత్మ అనేక ఆకారములలో

ప్రకటింపబడుతు పాపములను దోచుకొనుచు ప్రాణులను సంస్కరిస్తుంటాడు.బహురూపములైన భగవత్తత్త్వమును భజించవే ఓ మనసా!

యజ్ఞశర్మ కుమారుడైన "గుణనిధి"కథ ని (గుప్తచోరునిగా మనము పరిశీలిస్తే) శివలీలావైభవమును స్తుతించకుండ ఉండలేము.వ్యసనలోలుడైన గుణనిధి తన విలాసములకు కావలిసిన ధనమునకై,తండ్రి పాండిత్య ప్రతిభా పురస్కారముగా లభించిన వజ్రపుటుంగరమును రహస్యముగా దొంగిలించినప్పటికిని,అంత్య కాలమ్ను స్వామి దవ్వుననున్న రవ్వంత పుణ్యఫలమును దరిచేర్చి,పాపములను దొంగిలించి,సామీప్య-సాయుజ్యములనిచ్చి సంస్కరించెను." ఓం నమః శివాయ."


మరికొందరు,


ప్రకటిత దొంగలు,ప్రత్యక్ష దొంగలు వీరు.వీరికి నాయకుడు మన నిటలాక్షుడు. ఎంతటి విలక్షణుడో!విరూపాక్షుడు.

పరోక్ష దొంగను సంస్కరించిన శివయ్య, ప్రత్యక్ష దొంగయైన మల్లుని రక్షించిన విధానము కడు రమణీయము..

మైసూరు సమీపములోని నంజనగూడు ప్రాంతములో "మల్లుడు" అను తస్కరుడు కలడు.అతను దారిమూలలో దాక్కొని, బాటసారుల సంపదను భయపెట్టి దోచుకునేవాడు
.ఏ పూజావిధానము తెలియని వాడు వీడు. కాని ఏ పూర్వపుణ్యమో తెలియదు కాని,కళ్ళుమూసికొనినప్పుడల్లా ఏలినవాడు ఎదముందుండేవాడు.సహ ఉద్యోగిపై .సహృదయతకు సాఖ్యమేమో.చతుషష్టికళలలో స్థానమును సంపాదిందించిన కళ కనుక ఏ మాత్రము తప్పుగా భావించక బందిపోటుగా మారినాడు.పెరుగుట తరుగుట కొరకేగా!

" నమః స్సోభ్యాయచ ప్రతిసర్యాయచ" పుణ్య-పాపముల లోకమునందలి జీవులను అనుగ్రహించువాడా! నమస్కారములు.పరమేశ్వర ప్రణామములు.

కాల భ్రమణములో మల్లుని నియమపాలన సమయము రానేవచ్చినది రాబోవు పరిణామములకు సూచనగా.

.మల్లునికి ఒక నియమము కలదు సంవత్సరాంతమున తాను దోచిన ధనమును మొత్తము ఉపయోగించి " కాట్రేడు జాతరను" కాటి-రేడు. ఘనముగా జరిపించి అమితానందమును పొందెడివాడు.ప్రతి సంవత్సరము ఇదే వీడివరస.వీడి పేరుపై "కల్లన మూలై" ఇప్పటికి విరాజిల్లుతోంది.నాటకమును రక్తి కట్టిస్తున్నాడు నందివాహనుడు.జాతర ముగియగానే తిరిగి మొదలవుతుంది వీడి దౌర్జన్య దోపిడి.భక్తిని తోసివేస్తోంది వీడి చోరశక్తి.

అన్నీ తానైన వాడు మిన్నకుండలేడుకదా!

" నమో నిచేరవే పరిచరాయా అరణ్యానాం పతయే నమః"

దొంగలించుటకు అవకాశమునకై వేచియుండు మల్లునిని కనికరించదలచినాడు.

అంతే కాదు "నమ:సస్పింజరాయ త్విషీమతే పత్తీనాం పతయే నమః"

బాటసారులను రక్షించు పింగళవర్ణధారి అనుచు వారు చేయుచున్న ఉభయ నమస్కారములను స్వీకరించి అనుగ్రహించదలచిన స్వామి,వెంటనే,

నమో ప్రతరణాయ ఉత్తరణాయచ" గా మారి ,

మల్లుని దౌర్జన్యపు గట్టు నుండి దయార్ద గట్టునకు చేర్చ దలచాడు అనుకున్నదే తడవుగా అద్భుతాలతో మల్లుని అంతరంగం పరవశించి,

మధురం శివనామం మదిలో మరువకే ఓ మనసా

జనులకు ఇహ-పర సాధనమేపలుకగ సురుచిర పావనమే అంటూ,కౄరుడు చిత్తచోరుని కీర్తించసాగాడు.కమ్ముకున్న కాఠిన్యము కరిగి పోయింది.కరుణ కదలక కూర్చున్నది కనులారా దర్శిస్తూ స్వామిని.బందిపోటును బంధించింది విశ్వేశ్వరానుగ్రహము..శివోహం.

కాఠిన్యమును కాల్చివేసినాడు ఆ కాముని కాల్చినవాడు.

మధురం శివమంత్రం మదిలో మరువకే ఓ మనసా!


భావజ సంహార-మమ్ముల కావగ రావయ్యా. అంటూ,-

బాటసారులు తమ సంపదను స్వచ్చందగా సమర్పించేవారు.మరింత వైభవముగా మల్లుడు మల్లేశ్వరుని జాతర జరిపిస్తు,స్వామి సాన్నిధ్యమును పొందగలిగాడు మల్లుడు."

" నమ:శంగాయచ-పశుపతయేచ" సర్వజీవులకు శుభములను కలిగించు సర్వేశ్వరా! దొంగల రూపములలో నున్న ఓ పెద్దదొంగ నీవు వారి కర్మఫలములను కానరాకుండా,కనుమరుగు చేయుచున్నావు.వాటిని తిరిగి వారి దరిచేరనీయుట లేదు.వారిని జీవన్ముక్తులుగా చేయుచున్న " ప్రణత దు:ఖద్రావక" నమో నమః.

స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.

( ఏక బిల్వం శివార్పణం)

ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...