TIRUVEMBAVAY-15
తిరువెంబావాయ్-15
**************
"కృపాసముద్రం సుముఖం త్రినేత్రం
జటాధరం పార్వతీ వామభాగం
సదాశివం రుద్రం అనంతరూపం
చిదంబరేశం హృది భావయామి.
సందర్భము
**********
ఇప్పటివరకు మడుగు,మడుగులోని జలము,ప్రవహాము,తెల్లని కొంగలబారు,వికసిస్తున్న నల్లకలువలు,ఎర్రని పద్మములు సకలము శివానుగ్రహ సంకేతముగా భావిస్తూ,దివ్యమంగళ స్నానము చేస్తూ మాయను విడిచిపెడుతున్న వారి దృష్టిని వారిలో ఒకరైన ధన్యురాలి వింతప్రవర్తనము వైపునకు మరల్చాడు ఆ చిదంబరేశుడు.ఈ పాశురము నామసంకీర్తనా వైభవమును,నామికి-నామమునకు కల అభేదమును మనకు అందిస్తుంది.
పాశురము
***********
ఓరు రకాల్ ఎం పెరుమాన్ ఎన్రెన్రే నం పెరుమాన్
శీరోరుకాల్ వాయోంవాళ్ శిత్తం కళికూర
నీరొర్కాల్ ఓవా నెడందారై కణ్ పణిప్పన్
పారోర్కాల్ వందనయాల్ విణ్ణోరై తాం పణియాన్
పేరరయన్ ఇంగణ్ణే పిత్తోర్వార్ ఆమారు
ఆరోరువార్ ఇవ్వణం ఆట్కోళం విత్తకర్తాళ్
వారురువ పూణ్మలైయార్ వాయార్ ఆనాంపాడి
ఏరురురువం పూం పునల్ పాయింద్ ఆడేలో రెంబావాయ్
"మథురం శివమంత్రం మదిలో మరువకే ఓ మనసా
ఇహ-పర సాధనమే నరులకు సురుచిర పావనమే
భారము నీదయ్యా-నీ పాదము విడనయ్యా''
అంటూ ప్రారంభింపబడిన సంకీర్తనము తన స్వభావమును మార్చుకొనుచు,
అమ్మా-అయ్యా అటంచు నేను ఎవ్వరిని అనను సుమీ
నాకు తల్లియు-తండ్రియు-గురువు నీవె
సంసారపు చిమ్మని చీకటి కప్పకుండా చూడవలసిన బాధ్యత నీదే సుమా అంటూ హెచ్చరిస్తుంది.
అదే జరిగింది ఇక్కడ.
ఓరురుకాల్-ఒకప్పుడు -ఎం పెరుమాన్ అన్న జిహ్వ ఇప్పుడు-నం పెరుమాన్ నా మహదేవుడు అంటున్నది.అదియును ఒకప్పుడు నామదీక్షను స్వీకరించిన ఉపాఢి ఒక నియమిత కాలములో,నియమాను సారముగా,నియమిత సంఖ్యను పూర్తిచేసుకుని తృప్తి చెందెడిది.శివుని చిద్విలాసము ఇప్పుడు "పిత్తోర్వర్" గా,పిచ్చిపట్టినదానిలాగా సర్వకాల-సర్వావస్థల యందును ఓం నమః శివాయ అంటూనే ఉంటుంది.
ఆ నిరంతర నిశ్చల నామసంకీర్తనము భూమ్యాకాశములను గుర్తించనీయదు.బూదిపూతలవాడినే దర్శింపచేస్తుంది.
ఇప్పటి వరకు బాహ్యము-ఆంతర్యము అని రెండుగా తన చెలులతో నున్నదానిగా భావించిన ఈ సుకుమారికి ఇప్పుడు బాహ్యవస్తువులు కనుమరుగైనవి.చెలులను సైతము చేరనీయక నామమును
"పిబరే " గ్రోలుచున్న వేళ,
చిత్తము సైతము విచిత్రముగా సర్వేశుని తక్క సర్వమును మరపింపచేస్తున్నది
ఆనందాశ్రువులు అనవరతముగా అభిషేకిస్తున్నాయి
పతిం విశ్వస్య ఆత్మేశ్వరగం శాశ్వతం శివమచ్యుతం గా భాసిస్తున్నది హృదయము.
పరా భక్త్యా యత్ ప్రాప్తా
న కించిత్ వాంఛతి-న ఆత్మారామో భవతి.
ఆమె మనసు
ఆరొరువర్-నిర్ద్వంద్వమైన నామమును వినుచు తరించుచున్నది
ఆమె, ఆ అంతరంగ హ్రదములో
విత్తగళ్ తాళ్ విశ్వేశ్వరుని పాద సందర్శనముతో/సంసేవనముతో ,ఆత్మానందములో మునకలు వేయుచున్నది.చెలులారా కదిలిరండి.మనలోని మనను దర్శించి తరించుదాము.
అంబే శివే తిరువడిగళే శరణం
ఏక బిల్వం శివార్పణం.
.
' పరా భక్త్యా
యత్ ప్రాప్య న కించిత్ వాంఛతి- న శోచతి
ఆత్మారామోభవతి
అంతః బహిః యత్ సర్వం వ్యాప్త
పతిం విశ్వస్య ఆత్మేశ్వరగం శాశ్వతగం శివం అచ్యుతం.
.............................................
ఆత్మాశ్రయణ భక్తిని/పరా భక్తిని ఏ విధముగా ఆశ్రయించినదో,దానిని పట్టుకొనుటకు/అంతర్ముఖమగుటకు బహిర్ముఖత్వమును ఏ విధముగా విడిచి పెట్టినదో మనకు వివరించుచున్నారు.
సిత్తం కళి-మనసు ఆనందముతో ఉప్పొంగగా
పాయింద్-మునిగి
ఆడేలో-ఆడుదాము అని చెలులను పిలుస్తున్నారు.
సిత్తము లో అనందమునకు కారణము
ప్రస్తుత పాశురములో వీరు దూకి ఆడదలుచుకొన్న పొయిగై బాహ్యములో లేదు.అది వారి అంతరంగమున నిండినది.
ఆ మడుగులోనికి జలము ఏ విధముగా నిండియున్నదంటే.
నెడందారై కణ్ పణిప్పన్-మనసులో నిండిన ఆర్ద్రత పొంగిపొరలి నయనములకు చేరి ఆనందాశ్రువులను అనవరతము వర్షించుచున్నవి.
ఆ అంతరంగ కొలనులోనికి
పాయిందేలో-మునిగిన వెంటనే,
" యజ్ఞాత్వా మత్తో భవతి-స్తబ్దో భవతి
ఆత్మారామో భవతి.'
ఆ పొయిగై లోనికి దూకి /బాహ్యమును వీడి అంతరంగములోనికి జారిన వెంటనే జీవుడు
మత్తులో మునుగుతాడు.స్తబ్దుడుగా మారతాడు.తనను తాను కనుగొనే ప్రయత్నములో తన ఉనికిని మరిచిపోతాడు .
పరా భక్త్యా యత్ ప్రాప్తా
న కించిత్ వాంఛతి-న శోచతి -ఆత్మారామో భవతి.
ఆమె మనసు
ఆరొరువర్-నిర్ద్వంద్వమైన నామమును వినుచు తరించుచున్నది
ఆమె, ఆ అంతరంగ హ్రదములో
విత్తగళ్ తాళ్ విశ్వేశ్వరుని పాద సందర్శనముతో/సంసేవనముతో ,ఆత్మానందములో మునకలు వేయుచున్నది.చెలులారా కదిలిరండి.మనలోని మనను దర్శించుకుంటు, తరించుదాము.
అంబే శివే తిరువడిగళే శరణం
ఏక బిల్వం శివార్పణం
.





Comments
Post a Comment