జై శ్రీరాం

 **********

 ఎంతటి చమత్కారి అగస్త్యభగవానుడు.రామచంద్రునకు 'తతో యుధ్ధమునా చింతా శోకములను తొలగించుటకై రాముని సమీపించి,స్తోత్రమును ఉపదేశించి నిజస్థానమునకు తరలినాడట.ఇంకాచమత్కారము రామచంద్రుడు భక్తి-శ్రధ్ధలతో ప్రార్థించగానే సూర్యనారయణుడు సంతుష్టుడై రామునిసమీపించి,రావణునికి మరనము ఆసన్నమైనదని కాల స్వరూపునిగా/యమునిగానిర్దేశించి,రాముని దీవించి,సంతసముతోనిజస్థానమునకు చేరినాడట.

 అంటే అతి పవిత్రమైన ఆదిత్యహృదయస్తోత్రము కేవలము రామునికిసంబంధించినదా/లేక సకల చేతనులనూద్దేశించి,వెలుగు మార్గమును చూపించుటకు పరోక్షముగా ప్రసాదించినదా అన్న ఒక్కఆలోచన  

 మనకు నామికి-నామమునకు భేదము లేదని,సకలములో అంతర్యామిగా దాగిన పరమాత్మ తానొక మానవ ధర్మమును అనుసరిస్తూ,ధర్మసంస్థాపనమును ఏ విధముగా నిలిపినాడో విశదపరుస్తుంది.

  నారాయణుడే రామచంద్రుడు/సూర్యనారాయణుడు/అగస్త్యభవ్గవానుడు,ఆంజనేయుడు/విభీషణుడు/యుధ్ధభూమి,సీతమ్మ,సర్వము/సకలము పరమాత్మే.

 అయినప్పటికిని,

" గోచరంబగు జగములోపలగోప్యమైనది రామనామము."

 తాను గోప్యముగా ఉండి మనందరిచే,రాముడు యుధ్ధభూమిలో ఉన్నాడు/రాముడు చింతా-శోకముతోనున్నాడు,రాముడు తన ఎదురుగా వచ్చినిలిచిన రావణునిచూశాడూంటూ,రామకథను చెబుతున్నట్లుగా మనచే భావింపచేస్తూ,రామనామమును పలికించినాడు.

 మనము ముందు చెప్పుకున్నాట్లుగా ఇది రామ-రావణ యుధ్ధముకాదు.

 తత్ అనగా ఇది వీరిది అనినిర్వచించలేనిది-మంగళకరమైన యుధ్ధము.ప్రతిఉపాధికి సంధించినది.ప్రతిచోట ఉన్నది.ప్రతిక్షనము జరుగుచున్నది.

  దీనిని సృష్టించినది ఎవరు?చేయించుచున్నదిఎవరు?ముగింపు పలికేదిఎవరు?

 అన్న ప్రశ్నలకు సమాధానమె,

 "సృష్టి-స్థితి-లయకారణంబగు సూక్ష్మరూపము రామనామము అని మనకు తెలుస్తూనే ఉంది.

  పరమాత్మ ఆయుధ్ధమును ఏ విధముగా ప్రకటింపచేస్తున్నాడు?అనుకుంటే దానికిసమాధానము,

" సకలజీవులలోన వెలిసిన సాక్షిభూతము రామనామమూఅని సమాధానము దొరుకుతుంది.

 రావణుని ఇంద్రియములు అరిషడ్వర్గములకు అందగా నిలిచినవి.అధర్మమును ప్రోత్సహించినవి.అవివేకమునకు ఆలవాలము చేసినవి.సమయము వచ్చినప్పుడు మాత్రమే అవి

" తుంటరి కామాదులను మంతగలుపును రామనామము" అనునది సమాధానము.

అంతటి శక్తిగల రాముడు చింతాశోకములను తనను ఎందుకు ఆశ్రయము కల్పించినాడు.అది మానవధర్మము కనుక.అప్పుడు కావలిసినది ఏమిటో కూడా ఆదిత్యహృదయ స్తోత్రము సోదాహరనముగా వివరించుచున్నది.

"విజ్ఞుడగు గురునాశ్రయించిన విదితమగునది రామనామము" అదియే కదా అగస్త్య భగవానుడు రామునకు స్తోత్రమునూపదేశించి తరలిపోవుట.

మానవ ధర్మమును పాటిస్తున్న రామునకు తగిన సమయములో చక్కటిపరిష్కారము లభించినది.సాధన చేయించినది.సత్ఫలితములను అనుగ్రహించినది.

 ఇంకొక విచిత్రము,

రాముడు ఉదయాద్రిపై రశ్మిమతుని-సముద్యంతుని స్తుతించినాడట.


Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)