Sunday, March 4, 2018

SAUNDARYA LAHARI-26


  సౌందర్య లహరి-26

  పరమపావనమైన  నీపాదరజ కణము
  పతిత పాలకమైన  పరమాత్మ స్వరూపము

  మధుకైటభ సంహారివి  మాధవ సోదరి
  భండాసురుని జయించిన భువనభాండ రక్షిణివి


  రక్తబీజునికి ముక్తినందించిన శక్తిస్వరూపిణివి
  విషంగ విశుక్రుల విషమును అరికట్టితివి

  మహిషాసురుని మర్దించిన మహిమాన్వితవి
  అవనీ పాలనకై  ఎన్నో అవతారములనెత్తితివి

  అరిషడ్వర్గములనడచు  అసుర సంహారములు
  మదరహితములై తల్లికి వందనములగుచున్న వేళ

  నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి  ఓ సౌందర్య లహరి.



 అంబ వందనం  జగదంబ వందనం
 సంబరాన కొలువుతీరె శక్తి, వందనం
 భవతారిణి భగవతికి, భక్తి వందనం

పారిజాత అర్చనల  పాదములకు వందనం
పాపనాశిని పావని  పార్వతి వందనం.

గులాబీలు గుబాళించు  గుల్భములకు వందనం
గణపూజిత గుణాతిశయ  గౌరి వందనం.

ముద్దు గణపయ్య  కూర్చున్న  ఊరువులకు వందనం
ఎద్దునెక్కు శివునిరాణి  గిరిజ వందనం.

అఘరహిత తల్లి శుభ జఘనమునకు వందనం
గిరితనయ విరిపూజిత దుర్గ వందనం.

విదుషీమణి అలంకృత  మణిమేఖలకు వందనం
అఖిలాండపోషిణి  ఆదిశక్తి అన్నపూర్ణ వందనం.

భక్తానుగ్రహ హృదయారవిందమునకు వందనం
ముక్తినిచ్చు అలంపుర జోగులాంబ వందనం.

సకలశాస్త్ర ధర శుభకర కంకణములకు వందనం
శక్తిపీఠ నిలయ లంక శాంకరి వందనం
.
త్రయంబకుని రాణి భవాని కంబుకంఠమునకు వందనం
సృష్టి స్థితి లయ రూపిణి త్రిపుర సుందరి

విబుధ స్తుతుల విరాజిల్లు చుబుకమునకు వందనం

లక్షణ రూపిణి సన్నుత కొళాపురి మహాలక్ష్మి వందనం.

బీజాక్షర పూరిత   రాజ్ఞి ఓష్ఠమునకు వందనం
అఖిల జగతి సాక్షి కాశి విశాలాక్షి వందనం.

ముక్తిప్రదాత్రి యోగశక్తి వక్త్రమునకు వందనం
శుక పలుకుల శుభకరి కశ్మీర వాణి వందనం.

నవమౌక్తిక నాట్యాల నాసాగ్రమునకు వందనం
నవనవోన్మేషి స్థితివి నారాయణి వందనం.

తపోధనుల తల్లి నీ కపోలములకు వందనం
కన్నతల్లి కల్పవల్లి శ్రీ లలితాంబిక వందనం.

సూర్య చంద్ర చిత్స్వరూప నేత్రములకు వందనం
స్తోత్రప్రియ మూర్తిత్రయ కామాక్షి వందనం.

మణికుండలముల మెరయు కర్ణములకు వందనం
శ్రుతి స్మృతి వినుత విరాజిత అపర్ణ వందనం.

ఫాలలోచనుని రాణి ఫాలమునకు వందనం
పాలాభిషేక ప్రియ నందిని పార్వతి వందనం.

అక్షయ ప్రశస్తిగ కస్తూరి కుంకుమకు వందనం
లక్ష లక్షణ ప్రస్తుత దాక్షాయిణి  వందనం.

క్లేశహరిణీ పరిమళ కేశములకు వందనం
వాసవాది వినుత కేశవ సోదరి వందనం.

అంబవందనం  జగదంబ వందనం
కంబుకంఠి రాణి కళ్యాణి వందనం.

  సకలజగతి వందనములిడుచున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.


  

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...