ADITYAHRDAYAMU-21


 


 ఆదిత్యహృదయం-శ్లోకము-21

     ********

 ప్రార్థన

 *******


" జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం

  కిరణ సమితపాపం క్లేశ దుఃఖస్య నాశం

  అరుణ కిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం

  సకలభువనవంద్యం భాస్కరం తం నమామి."


పూర్వరంగము



"మమయోనిః మహత్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం


సంభవః సర్వభూతానాం-అంటూ ,


ఇక్కడ యోని శబ్దము మూలకారణముగా అన్వయించుకోవాలి.


ఇది స్థూల విశ్వరచనకు మూలకారణము పరమాత్మ.


ఆ పరమాత్మ సూక్ష్మముగా ,


"సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశం ఉపజాయతే-ఇది ఉపాధికి సంకేతము అన్న భగవద్గీతా సారమును తెలియచేసిన అగస్త్యభగవానుడు,త్రిగుణముల ప్రభావమును ప్రస్తుత శ్లోకములో వివరిస్తున్నారు.


 పరంజ్యోతి యైన పరమాత్మ తమమును-హిమమును-శత్రువులను-కృతఘ్నతను సంపూర్ణముగా నాశనము చేసి ,నిర్ద్వంద్వ స్థితిని ప్రకటించినాడు అని చెప్పిన అగస్త్యభగవానుడు పునః సృష్టిని చేయుచు,నిరంజనుదైన స్వామి సర్వమలినములను హరించివేసి,రోచిష్ముడై, పుటము వేసిన అగ్నివంటి వర్ణముతో ,కన్నులముందు కనపడుతూ,కిరణములనే కరములతో ,పంచకృత్య భారమును వహించు వహ్ని వలె,


"తప్తంచకర-తప్తచామీకరుడై-ఆ భా-సమస్తమును ప్రకాశవంతము చేస్తున్నాడు అంటూ,అగ్నిద్యోతక స్వరూప సూర్యనారాయణుని సంకీర్తిస్తున్నాడు.


శ్లోకము


*****


"తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే


 నమః తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే"


విఘ్నేశ్వరనుగా విశ్లేషింపబడిన పరమాత్మ వటపత్రసాయియై, తదుపరి పునః సృష్టిని ప్రారంభిస్తున్నాడు.జలమయములైన జగములు తిరిగి తమతమ రూపములను ప్రకటింపచేసుకొను శక్తిని రుచుల ద్వారా/కాంతులద్వారా పొందగలుగుతున్నాయి.


ఇదే విషయమును "దుర్గాసూక్తం గా ' పేరుగాంచిన ఆదిత్యసూక్తము,


" ఓం "


జాతవేదసే సునవా మసోమ మరాతి యతో నిదహాతి వేదః


సనః పరుషదయతి "దుర్గాణివిశ్వా నావేవ సింధుం దురితాత్ యగ్నిః'


దుర్గాణి దాటలేని సుడిగుండములు కల సంసారమనే సముద్రమును దాటించకల నావవు నీవు .ఓ పరమాత్మ సోమరసమును/సర్వస్య శరణాగతి అను భక్తిభావనమును నీకు సమర్పిస్తు,మమ్ములను రక్షించమని వేడుకుంటున్నాము.


ఓ జాతవేద-ఎనిమిది అగ్ని స్వరూపములలో ఒకటై,,మా ఉపాధులలో ప్రవేశించి,మమ్ములను అంతః యజ్ఞ సన్నద్ధులను చేయుచున్న పరమాత్మ నీకు నమస్కారములు.


యజ్ఞ రూపముగా నిన్ను ప్రార్థించగల కరుణను ప్రసాదించు నీవు,


" తామగ్ని వర్ణాం తపసాంజ్వలంతీం


  వైరోచనీ కర్మఫలేషు జుస్ట్వాం


"దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే "


స్తుతరసి తరసే నమః."


స్వామి/ మాతా! నీవి అగ్నివర్ణముతో  జాజ్వల్యమానముగా దర్శనమిస్తున్నావు.


విస్తరించిన రోచిస్సులతో మాకర్మఫలములను హరింపచేస్తున్నావు.


దుర్గ్మాదేవీం -జగన్మాత అని ,ఒక అర్థము.


ఛేదించలేని కషటములను తొలగించు శక్తి అని మరొక అన్వయము.


ఓ దివ్య ప్రకాశమా!నేను నీ శరణాగతినై నన్ను తరింపచేయమని వేడుకుంటున్నాను.


పుటము వేసిన బంగారు కిరణములనే కరములతో సర్వత్ర వ్యాపిస్తూ,రక్షణభారమునుమోస్తున్న/వహిస్తున్న వహ్ని రూపునకు లోకసాక్షికి,/


లోక సాక్షిని,


" నమః సవిత్రే జగదేకచక్షుసే


జగతః ప్రసూతి స్థితి నాశ హేతవే


త్రయీ మయాయ త్రిగుణాత్మధారిణే


విరించినారాయణ శంకరాత్మనే '


అని సంస్కృత భాష ,సన్నుతిస్తుంటే,




పగటికి బీజమున్ తిమిర బాధక మక్షికి నంజనంబు ము


క్తిగవిని, "ముజ్జగాలఁ దగు దీపము లొక్కటియైన ముద్ద" వా


న గురియు హేతు "వబ్ధి రశనారసపానము పెద్దచెంబు "పే


ర్మి గలుగు సూర్యమండలము మీకునుఁ గోరిక లిచ్చుగావుతన్.


ఓ సూర్యభగవానుడ! నీవు పగటి ప్రకటనమునకు విత్తనము.చీకటికి బాధాకరము.కంటికి చల్లదనమునందించు కాటుకవు.అన్నింటికంటే అపురూపము,


"ముజ్జగాలదగు దీపములొక్కటియైన ముద్ద"సముద్రజలపానముచేయు పెద్ద చెంబు"


పేరిమి/మనందరిపై ప్రేమకలిగిన సూర్యమందలమును సంకీర్తించుచున్నవేళ,


"తం సూర్యం ప్రణమామ్యహం." 

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI