Thursday, January 21, 2021

TIRUVEMBAVAY-14

  తిరువెంబావాయ్-14

 *************

 కాదార్ కుడైయాడ పైపూంకలానాడ
 కోదై కురళాడ వండిన్ కుళామాడ

 సీద పునలాడి చిట్రం బలం పాడి
 వేద పొరుల్పాడి అప్పొరుళ మాపాడి

 శోది తిరం పాడి శూల్కొండ్రై తార్పాడి
 ఆది తిరంపాడి అందం ఆమా పాడి

 పేదిత్తు నమ్మై వళతెడుత్త పెయ్వలైదన్
 పాదతిరం పాడి పాడేలొ రెంబావాయ్

 వైద్యనాథ తాయియే పోట్రి
 *************************

 తిరు మాణిక్యవాచగర్ ఈ పాశురములో స్వామి దయాంతరంగమును తనను శర్ణుకోరిన వారికి సాక్షాత్తు తల్లిగా మారి ఏవిధముగా ప్రసవము చేసాడో చెప్పకనే చెప్పుచున్నాడు.

 స్వామి వేదమయుడు.తేజోవంతుడు.ఒకటేమిటి అన్నియును తానైన స్వామిని తాయిని చన్నీటి జలములో మునిగి పునీతులమై మన కర్ణాభరణములు-ఇతర అభరనములు కదులు కుండగా-ఆ ఆభరములు సామాన్యమైనవికావు.సద్గుణరాశులు-సవినయ సమర్పితములు.సద్గుణభూషితులైన పడుచులు సవినయముగా స్వామిని కీర్తించుచున్నారు.దానికి తోడుగా వారు కేశములలో ముడుచుకున్న పూవులును స్వామిని కీర్తించుచున్నవట.పంచేంద్రియ సన్స్కారములే వారు ముడుచుకున్న పూవులు.అవి పరవశించి స్వామిని పరిపరివిధములుగా కీర్తించుచున్నవి ప్రస్తుతించుచున్నవి.అట్టి స్వామి మాతృవాత్సల్యమును పొందుదాము సివనోముతో.

  అంబే శివ దివ్య వడిగళే శరణం.


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...