SEETAA YAJNAMU

ఏరువాక (సీతా యజ్ఞము )
************************
మట్టిపై మమకారమాయె
రైతు కంట కారమాయె
అన్నదాత కళ్ళుసూడ
ఆగని జలధారలాయె
గుండె పగిలి సెరువాయె
ఆ సెరువు నీటితోనైన
సేద్యము సేద్దామన్న
ఏడున్నది ఏరువాక? ఎన్నడమ్మ దాని రాక?
అరకొర వానలాయె
అరక దూపు తీరదాయె
అన్నదాత పెయ్య సూడ
సిక్కిన బొక్కల గూడాయె
బుక్కెడు బువ్వ లేకపోయె
ఆ బొక్కలగూడు కాడెయైన
దుక్కి దున్నుదామన్న
ఏడున్నది ఏరువాక? ఎన్నడమ్మ దానిరాక?
దళారీ దందాలాయె
ధర అసలు గిట్టదాయె
అన్న దాత బతుకు సూడ
ఆగమవుతున్నదాయె
ఆశలు బుగ్గిపాలాయె
ఆ ఆగము నాగలిచేసియైన
సాగు సేద్దమనుకుంటే
ఏదమ్మ ఏరువాక? ఎన్నడమ్మ దానిరాక?
దేశపు వెన్నెముక ఆయె
దేనికి వెనుకాడడాయె
అన్నదాత తెగువ సూసి
పశువులకు పూజలాయె
పంట పనులు షురువాయె
నేడే కద ఏరువాక నేటిరైతు ఆశారేఖ!!!!!!!!!!.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI