VYARTHAM ANU MAATA NISHIDDHAM

వ్యర్థం దీని అర్థం?
వ్యర్థం అనే పదానికి
అర్థాలే వేరులే
నిరర్థకము అన్నదేది లేదు
అర్థమైతే అనుభవము.
......
నేలరాలు గోరుచూసి
గేలిచేయు జనులకు
పులిగోరుగ మారి తన
విలువను తెలిపింది
......
జారిపోవు జుట్టుచూసి
బేజారవుతుంటే జనులు
ఉన్నికోటుగ మారి చలిని
తరిమికొట్ట కలిగింది
.......
ఊడుతున్న దంతాలు
ఏడుపుముఖమును పెడితే
ఏనుగు ఎత్తుకు ఎదిగి
జగమే ఏలేస్తుంది
.........
మమతలు మారిపోయి
నీ జతను వీడుతుంటే
గొంగళిపురుగేగ
సీతాకోక చిలుక
సంగతి తెలిసిందా
ఎందుకింక అలుక
ఘనతను పొందే మార్గం
భవితగ మారుతుంది నీ
భారం దించుతుంది

Comments

Popular posts from this blog

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI