Thursday, May 9, 2024

SARVASAPARIPURAKA CHAKRAMU-PARICHAYAMU

 


  పరమేశ్వరి అనుగ్రహముతో మనము రెండవ ఆవరనమైన "సర్వాశా పరిపూరక చక్రము"లోనికి ప్రవేశించుచున్నాము.ఇక్కడ"త్రిపురేశి" చక్రేశ్వరి.పదహారు తిథినిత్యా దేవతల 'షోడశదల కమలము" గుప్తయోగినులతో,


 "ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా

  శ్రీ- షోదశ అక్షరీ విద్యా త్రుకూట కామకోటికా" గా విరాజమానమై యుంటుంది.

 పరమేశ్వరినిరుపప్లవ-అనగా వృద్ధి/క్షయములు లేని మోక్షస్వరూపము.అట్టి తల్లి మనలను అనుగ్రహించుతకై వృద్ధి/క్షయ స్వభావితములైన తిథినిత్యదేవతలతో విరాజమానమై మనలను అనుగ్రహించుచున్నది.

  ఇది ఒక సంభావనమైతే.మరొక విధానములో 16 షోడశ ఉపచారములు-షోడశ సంస్కారములు-షోడశ అక్షరములు తానైనది షోదసదళాస్థిత యైనజగన్మాత.

  అమ్మ అష్టమీచంద్ర విభ్రాజ-

 ఏ మార్పులు లేని త్వరిత కళను శిరోభూషనముగా ధరించిప్రకాశించునది.

 ఈ త్వరిత కళ ఎటువంటి మార్పులు లేని "నిర్గుణ తత్త్వమునకు"ప్రతీకగా ప్రకాశిస్తుంటుంది.

 గుణములు ఉపాధిని ఆశ్రయించి ఉండునుకాని ఆత్మను చేరలేవు.


  షోడశ దళ పద్మములోని పదహారు రేకులను పంచభూతములు+పంచేంద్రియములు జ్ఞాన+పంచేంద్రియములు కర్మకు+ మనసుకు అన్వయిస్తారు.

 ఇవి అంతర్ముఖమునకుసహాయపడే గుప్త శక్తులు.

  అమ్మ మనోరూపేక్షు కోదండా-పంచతన్మాత్ర సాయకా.అమ్మ చెరుకు విల్లు నిజతత్త్వమనే మధువును అందించే విల్లును చేత ధరించి,పంచ తన్మాత్రలనే బానములతో మనలను ఉద్ధరించుటకు సిద్ధముగా ఉన్నది.

 కాని మనము బాహ్యమునుచూసిపరవశిస్తూ,దేహమేనేను అనేభ్రాంతితో,కోరికలవైపు,విద్యలవైపు,శబ్దమువైపు,రుచులవైపు,వాసనలవైపు,రూపముల వైపు,నామముల వైపు మన్మథ బానములచే ప్రభావితులమై మైమరచిపోతుంటాము.అదియును అమ్మ అల్లుచున్న మాయాను అవనికయే.తెరచాటున ఉన్న తేజోమూర్తిని గుర్తించలేని అహంకారమే.అజ్ఞానమే.

 ప్రథ్వీ తత్త్వమైన మూలాధారములోని వస్తుప్రపంచమను సత్యమన్న భ్రాంతిలో నున్న సాధకుని మనసును పరమేశ్వరి ఈ గుప్త యోగినుల అనుగ్రహము ద్వరా భ్రమలను తొలగించి తన వైపునకు ఆకర్షించుకుంటుంది.

 అపారమైన అనుగ్రహము ఆకర్షించిన వేళ కామేశ్వర-కామేశ్వరియే కామదాయిని అని గ్రహించగలుగుతాడు.అనాహత శబ్ద నాదమే ,అజపా మంత్రమే ఆనందానుభూతిని అందించగలుగుతుంది.అన్ని రూపములే అమ్మ రూపములే అన్న సత్యము బోధపడుతున్నది.ఆనిపరిమళములు అమ్మ కరుణయే.అన్ని భోగములే అమ్మానురాగములే.అని తెలుసుకొనుచున్న సాధకుడు,

 పంచభూతములు+పంచజ్ఞాన+కర్మేంద్రియములు+మనసు అమ్మ భావనతో/ప్రాణ సక్తితో అనుసంధానమైన వేళ,

 తన యొక్క మనసు,ఇంద్రియములు,ధాతువులు,బాహ్యము నుండి అంతర్ముఖము చెందుతు,శుద్ధిచెందుట వలన,అమ్మ-నేను అన్న ద్వంద్వ భావములున్నప్పటికిని,రజోగుణరహితమైన తేజోమూర్తిగా మారుతూ,త్రిపురేశి ఆశీర్వాదముతో,మూడవ ఆవరనములోనికి,వికసిత మనస్కుదై ప్రవేశార్హుడగుచున్నాడు.

  యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థితా

  నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః.


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...