Monday, October 2, 2017

CHIDAANAMDA ROOPAA-SERUTTANNAI NAAYANAAR.

" పుష్ప మూలే వసేత్ బ్రహ్మ మధ్యేచ కేశవ పుష్పాగ్రేచ మహాదేవ సర్వదేవ స్థితో దళే" 
   చిదానందరూపా-11

 కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా
 కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా

 స్థిరమగు భక్తియను తిరువిరులను మాలగ తాను అల్లు
 సమర్పణమును చేసి ,సాష్టాంగము మోకరిల్లు

 కామేశుని ఆన కాన కాదనలేని విధంబున
 కదిలిరి రాజుయు-రాణియు  కథ నడిపించు పథంబున

 లీలగ,పూమాలల సుగంధము బంధము వేయగ
 హేలగ చేతబూని  వాసనచూసెను రాణి నాసిక

 అపరాధము చేసెననుచు నాసిక కోసెను సెరుత్తనాయి
 ముక్తిని పొందగ రాణి ముక్కును కోయుట కారణమాయెగ

 చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
 చిత్తము చేయు శివోహం  జపంబు నా చింతలు తీర్చును గాక.

 భగవంతుడు పుష్పములలో నిండి,కరుణతో వాటిని వికసింపచేయుచు,చూసి సంతసించుటను ఆధారము చేసుకొని పుష్పముల ద్వారా మనకు అర్థము-సౌఖ్యము-సాక్షాత్కారము అను మూడు దివ్య మహిమలకు శివుని చేతినున్న త్రిశూలములోని మూడు విభాగములను ప్రతీకగా కొలుస్తారు.భక్తులు.అతి స్వల్పకాలములో మనకు జగతి సృష్టి-స్థితి-లయములను వాటిని జరిపించే పరమేశ్వర తత్త్వమును చాటిచెబుతాయి పుష్పములు.అంతే కాదు.శబ్ద-చెవి,స్పర్శ -చర్మము,గంధ-నాసిక,రూప-నయనము,రస-నాలుక(మకరందము) మకరందముతో తుమ్మెదలు ఝుంకార వినబడునట్లు చేయు  పంచేంద్రియ ప్రతిరూపములైన పూలు, తాము పంచ భూతేశ్వరుని పాదపద్మలయందు నిలిచి పరవశించాలనుకొనుట సమంజసమేకదా.
   " ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు
    పూలిమ్మని రెమ్మ రెమ్మకు
    ఎంత తొందరలె హరు సేవకు
    పొద్దు పొడవకముదె పూలిమ్మని."
 అంటూ ఉదయముననే శేరు తునాయ్ నాయనారు పరమభక్తితో పూలమాలలల్లి పరమేశ్వరార్పితము చేసి పరవశించేవాడు. పొన్న-పొగడ-జిల్లేడు-తుమ్మి-ఉత్తరేణి-చెంగల్వ-మందార మొదలగు పుష్పములతో కాని,తత్ ఋతు పుష్పములతో గాని పరమేశుని అర్చిచిన సహస్ర గోదాన ఫలితము తథ్యమని నమ్మువాడు శేరుతనాయ్ నాయనారు,పార్వతీదేవియే చెప్పినదని పలు సుగంధపుష్పములను( అనాఘ్రత పుష్పములను) మాలలల్లి,మల్లేశుని అలంకరించి పులకరించేవాడు.తిలకిస్తున్న స్వామికి చిలిపి ఆలోచన వచ్చింది.రాణిని కథావస్తువు 
చేసి,కథను ముందుకు నడిపించాడు . రాణినాసిక తాను ఏమి ఆశించిందో ఏమో,పుష్ప సుగంధమును ఆస్వాదించకుండా ఉండలేకపోయింది.పరిసరములను గుర్తించలేని పరవశముతో పూసువాసనను పీలుస్తు,నాయనారు కంట బడింది.కాలరుద్రుడైనాడు నాయనారు,రాణి ముక్కును కోసివేసాడు.కేకలు వినిన రాజు,జరిగిన విషయము తెలిసికొని,ఆ పూవును నాసికకు అందించిన చేతిని నరికి,జరిగిన అపరాధమునకు మన్నించమని శివుని వేడుకున్నాడు.
   కరుణాంతరంగుడైన సాంబ శివుడు కటాక్షించి వారిని ధన్యులచేసెను.మరల మరల పుష్పించునట్లు చేయుట అనగా కరుణను మరల మరల వర్షింప చేయుటయే కదా.అట్టిపరమేశ్వరుడు మన హృదయములను అనాఘ్రాణిత సుమములను చేసి,ఆశీర్వదించును గాక.


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...