KADAA TVAAM PASYAEM-INTRODUCTION



  

  

 




  

  

 

  


 శివస్వరూపులారా! 

   అగ్ని స్వరూప నక్షత్ర కృత్తికా /కార్తిక మాసమున సత్యము-శివము-సుందరమైన అంబాసమేతముగా ,

 "కలాభ్యాం-చూడాలంకృత శశికలాభ్యాం' అంటూ  వచ్చేశాడు.అశేషఫలములను అందిస్తానంటున్న వారిరువురిని అంతఃకరణ శుద్ధితో  ఆహ్వానించేద్దాము.



    


  ' ఐంకార-హ్రీంకార-రహస్య యుక్త


    శ్రీంకార-గూఢార్థ-మహా విభూత్యా


    ఓంకార-మర్మ-ప్రతిపాదినీభ్యాం


    నమో నమః శ్రీ గురుపాదికాభ్యాం" 




  గుడివైపుగా మెల్లగా నడచి వెళుతున్న సాంబయ్య చెవిని పడింది శ్లోకం చిత్తవృత్తులను చిత్రముగా మలుస్తూ. నేనసలే నాస్తికుడిని.దేవుడే లేడు కదా.నాకెందుకు వాళ్ళేమి చెప్పుకుంటే అంటూ ముందుకు సాగాడు.మనిషి కంటె వేగముగా మనసు ముందుకు సాగుతోంది.అసలు మనసును మభ్యపెట్టి ఆటలాడుచున్న ఆ "టక్కరి" నాకు కనిపించాలేకాని,........పళ్ళునూరుతున్నాడు.


  శివుని కరుణ అర్థము కానిది


     కాని


  శివుని కరుణ అద్భుతమైనది.


 " క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం-క్రీడా మృగాస్తే జనాః"


 విలాసముగా ప్రపంచమనె క్రీడామైదానమును సృజించి,క్రీడాకారులుగా జనులను భ్రమింపచేస్తున్న పరమాత్మ,

 లీలామానుషధారియై కొత్త నామరూపములతో శంకరయ్యను సమీపించి,వినయముగా


 శంకరయ్యగారు నమస్కారము.ఎక్కడికో ..ఏదో-అత్యంత అవసరమైన పనిమీద వెళుతున్నట్లున్నారు.నేను  ఆ దారినే వెళుతున్నా నాపనిమీద.కలిసి వెళదామా కబుర్లాడుకుంటూ అన్నాడు.


 అదేనయ్యా శివయ్యా! ఆ దొంగవేషాలువేస్తూ అందరి మనసులు దోచుకుంటూ  ఆటలాడువానిని పట్టుకుని             మోసముచేవ్యుట సరికాదని తెలియచేద్దామని వెళుతున్నాను.


 వాడు నాకు కనపడాలేకాని-వానిని చూడగలగాలేకాని...అయినా వాడిని నేను


  "కదా త్వాం పశ్యేయం" 


   ఎప్పుడుచూస్తానో కాని కనపడేదాకా వెతుకుతూనే ఉంటాను అన్నాడు పట్టుదలగా..


  నేను అంతే శంకరయ్య గారు,అందరు నాకష్టాలను చూసి జాలితో వాని పాదాలు పట్టుకుంటే పాపాలు పోతాయట.పోయి పట్టుకో అంటే బయలుదేరాను.మరి నాకు సైతము/నేను సైతము,మీ లాగ బెదిరించలేకపోయినా-బతిమాలి  బంధవిముక్తుణ్ణి చేయమని అడగాలనుకుంటున్నాను.ఎప్పుడో వాడిని నేను సైతం చూసేది.


 "కదా త్వాం పశ్యేయం" అన్నాడు  విచారముగా. 



  వెంటనే ,అదేమిటయ్యా!


   నేనంటే భయము కనుక దాక్కుంటాడు.నువ్వు దీనుడనని చెబుతున్నావు.నీకు కూడా ఎప్పుడు వానినిచూడగలుగుతానన్న సందేహమేనా? అన్నాడు శంకరయ్య ఆశ్చర్యముగా.


  అవునండి!


   మీరు నన్ను అడగవచ్చు.ఎవరో తెలియదు.ఎక్కడుంటాడో తెలియదు.కోరికలను తీరుస్తాడో/కోరికలను లేకుండా చేస్తాడో అసలు తెలియదు.అట్టి వానికై నా వెతుకులాట మీకు వెక్కిరింతగా ఉంటుందేమో.


   నిన్న పంతులుగారుశివయ్యా!

నేనెప్పుడు నిన్ను చూస్తానో అని అంటుంటే సరిపోదురా అబ్బాయి  నువ్వెప్పుడు నన్ను చూస్తావో-  నేనెప్పుడు చూస్తానో అని లంకె వేసి  అంటుంటే   ఉబ్బులింగడు తబ్బిబ్బై నీ ముందుంటాడు.


 "కదా త్వం దృష్ట్వా"? అంటుంటే నీముందుంటాడు.వెంటనే 


  " కదా మద్రక్షాం వహసి_" అని అడగమన్నారండి.


  అందుకే ఆ మూడు వాక్యాలను ,




 1.కదా త్వాం  పశ్యేయం?


 2.కదా త్వం  దృష్ట్వా?


 3.కదా వా  మద్రక్షాం వహసి?


   అన్న వాక్యాలను మనమము చేస్తున్నానండి.మరసిపోతే ఎలా? అన్నాడు అమాయకంగా.


  విన్న శంకరయ్య నవ్వుతూ నీకు కనబడాలంటే,వాడు నిన్ను చూడాలా ముందుగా -బహు బాగా చెప్పావు.వాడికి నీ రక్షణాభారం 


అప్పగిస్తానన్నావు. వినేవుంటాడు.ఇంకెందుకు దొరుకుతాడు.


 వాడిని నేను పట్టి  తెచ్చి నీ ముందుంచుతానులే అన్నాడు శంకరయ్య ఠీవిగా.నాదం తనుమనిశం శంకరం.నమామి మనసా-శిరసా,


  బాహ్యదృష్టికి కార్యము-భావనా దృష్టికి కారణము గోచరమగుతాయి.


 స్వప్రయత్నమునకు సానుకూలతనందించగలిగేది కేవలము స్వామి అనుగ్రహము.

    అన్న మాట నిలబెట్టుకున్నాడా శంకరయ్య .ఆమహాదేవుడు ఎవరికి కనిపించాడు? ఏమనిపించాడు అన్న విశేషములను శివుని డమరుకము అనుగ్రహించినంతమేరకు మీతో పంచుకుంటూ బిల్వార్చనను చేసుకుందాము.


  ఇది, మహాదేవుడు నా ముచ్చట తీర్చుటకై నా చేతిని పట్టుకుని తనకు తానే వ్రాసుకుంటున్న అనుగ్రహము.అది సహించలేని నా ఉపాధి ఉక్కిరిబిక్కిరై కప్పలతక్కెడగా తప్పులను చేరుస్తూ తనపని తాను చేసుకుంటుంది.శివ స్వరూపులు ఆదిశంకరుల అనుగ్రహమైన శివానందలహరి స్తోత్రము అర్థము చేసుకునే నా ప్రయత్నముగా .భావించి నన్ను ఆశీర్వదించండి.


   కదిలేవికథలు-కదలనిది కరుణ.


     పాహిమాం పరమేశ్వరా.


    (ఏక బిల్వం  శివార్పణం)





  


  


 


  




 


  

  


 

  

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)