Thursday, October 3, 2019

PADISAKTULA PARAMAARTHAMU-CHINNAMASTAKA

   పదిశక్తుల పరమార్థము-ఆరవ శక్తి-ఛిన్నమస్తక.
   ************************************

  అమ్మ అనుగ్రహముతో మనము ఆరవశక్తియైన ఛిన్నమస్త తత్త్వమును అర్థముచేసుకొనుటకు ప్రయత్నిద్దాము.ఇక్కడ మనము ముచ్చటించుకొనవలసిన విషయములు మూడు. అవి తల్లి మనకు పరిచయము చేసినవి.

1.నాడీవ్యవస్థ.

  భైరవితత్త్వములో జాగృతమైన కుండలినీశక్తి సహస్రారముదాక సుషుమ్న అను నాడిద్వారా చేరుతోంది.అదియే కాక అమ్మకు ఇరువైపుల నున్న శక్తులను ఇడ-పింగళ నాడులుగా వివరిస్తున్నారు.వీటిలో సుషుమ్న ఆహారశక్తియై మూడువిభాగములుగా మారి రక్తధారలను అందించుచున్నది.


2.తల్లి మనకు నాడీమండలమును పరిచయము చేస్తూ,దానిని మనలోని సత్వ-రజో-తమోగుణ ప్రతీకలుగా వివరిస్తున్నది.కోపమును తెలియచేయు ఇడానాడిని రజోగుణముగా,అజ్ఞానమును తెలుపు నల్లని నాడిని తమోగుణ సంకేతముగా ప్రకటిస్తున్నది.ఆరెంటిని పోషించుతు తనకు తాను పోషించుకోగల స్వయంపోషకశక్తిగా,సత్వగుణ ప్రకాశిగా సుషుమ్నానాడిని చూపిస్తోంది.

3.నాడీమండలములోని మూడునాడులను-త్రిగుణములను పరికరములుగా మలచి,అమ్మ మధువిద్యా తత్త్వమును మనకు చెప్పుచున్నది.శుధ్ధసత్వస్థితిని రజో-తమో గుణములు ఏ మాత్రము ప్రభావితము చేయలేవు.ఏవిధముగా ఇహలోక మొండెం-పరమును చాటు తల విడివడినను మరణమును పొందలేదు.కాని ఇక్కడ మనము ఒక విషయమును గమనించాలి.మధువిద్య ద్వారా అమ్మ ముక్తసంగులకు ఆదర్శమైనది.మన నేటి ప్రవక్తలు మహానుభావులు సంసార ధర్మమును అనుసరిస్తూనే ఆధ్యాత్మిక మార్గములో పురోగమిస్తున్నారు.సత్వగుణకు సన్నిహితులగుచున్నారు.

 ఇప్పటివరకు పరిచయము గావింపబడిన దశేంద్రియములు-త్రిగుణములు-వాటికి తోడుగా అరిషడ్వర్గములను తెచ్చుకున్నవి అనుటకు ఉదాహరణయే తల్లి నిలబడిన రతీ-మన్మధ మైధున స్థితి.తల్లి దానిని సృష్టించి పరస్పరాకార్షణతో
జీవులను విస్తరిస్తూనే,హద్దులు దాటనీయకుండ దానిపై నిలబడి నియంత్రిస్తున్నది.లిమిటేషన్ ఎవాఇడ్స్ లిటిగేషన్ అని కదా ఆర్యోక్తి.జగన్మాత దానిని తెలియచేయుటకు తానే ఉదాహరణగా ,రజోపూరిత ఆలోచనలు గల రక్తప్రసరణమును శిరమునుఖండించి,దానిని విషయవాసనలు అనే మొండెం నుండి వేరు చేసి , శుధ్ధసత్వ నిధిగా చేస్తున్నది.ఇక్కడ అమ్మ చేస్తున్నది సవరణే కాని సంహారము కాదు అనుటకు అమ్మ చేతిలోని మస్తకము జీవించియే ఉన్నది.

 పంకములో నున్నను దానిప్రభావములేని జ్ఞాన పంకజము ఛిన్నమస్తాతత్త్వము.

  ఛిన్నమస్తా పాదారవిందార్పణమస్తు.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...