TIRUVEMBAVAY-03
తిరు వెంబావాయ్-03
*****************
" కృపాసముద్రం సుముఖం త్రినేత్రం
జటాధరం పార్వతీ వామభాగం
సదాశివం రుద్రం అనంతరూపం
చిదంబరేశం హృదిభావయామి."
సందర్భము
*********
శివనోమును ఆచరించుటకు ఇద్దరు చెలులను తమతో కలుపుకొని మూడవచెలి దగ్గరకు వచ్చారు కన్నియలు.
"విష్ణునాకర్ణించు వీనులు వీనులు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సుర రక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు"
అన్న పోతనగారి అభిప్రాయమునునకు నిలువెత్తు సాక్ష్యముగా ఈ భాగ్యశాలులు ప్రస్తుత పాశురములో మనకు అత్తన్-ఆనందం-అముదము అంటూ పరమాత్మ వైభవమును ప్రకటింపచేస్తున్నారు.
" ముత్తన్న వెణ్ నకయ మున్ వము ఎదురెళుందన్
అత్తన్ ఆనందన్ అముదన్ ఎన్ని ఎళ్ళోరి
తిత్తిక్కు పేశువాయ్ వందున్ కడై తిరవాయ్
పత్తుడయీర్ ఈశన్ పళ అడియార్ పాంగుడఈర్
పుత్తడియో పున్మై తీర్థాదు ఆట్కొండార్ పొల్లాదో
ఎత్తోనిన్ అంబుడమై ఎల్లోం అరియోమో
సిత్తం అళగియార్ పాడారో నం శివనే
ఇత్తనియుం వేండుం ఎమక్కేలో రెంబావాయ్."
ప్రస్తుత పాశురములో చెలులచే మేల్కొలుపబడున్న కన్నియ ,
ముత్తెములవంటి తెల్లని పలువరుస గలది.సత్వగుణ సంపన్నురాలు.
"సత్వాన్ సంజాయతే జ్ఞానం" అన్నట్లుగా జ్ఞాని.కనుకనే తానే తన చెలుల వద్దకు వెళ్ళి అత్తన్-ఆనందం-అముదం" అంటూ "ఆనందో బ్రహ్మ" అన్న విషయమును వారికి అర్థమయేటత్లు చేసి,శివనోమునకు సంసిద్ధులను చేసింది.
కాని ఆమె,
పుత్తడియో-అంటే స్వామి పాదసేవనమునకు పుదు-కొత్త.
కనుక యమ-నియమములను పాటించుటలో కొంత ..చెలులకు చెప్పిన మాటను మరచి ఇంకను నిదురిస్తూనే ఉంది.అదియును తలుపునకు గడియవేసుకొని.
ఇది గమనించిన చెలులకు వారు నిన్న వినిన మాటలు మాయమాటలుగా తోచినవి.
తలుపుగడియ తీసి నోమునకు సిద్ధము కమ్మని అందరము కలిసి చిత్తశుద్ధితో శివనామ సంకీర్తనమును చేద్దామని చెబుతున్నారు.ఆమె సంసిద్ధమవుతున్నది.
ఇంద్రియ ప్రవృత్తులే ఆ అడ్డంకులుగా నున్న తలుపుగడియ.దానినే పత్తుడయార్ అంటూ జీవుల పరముగా తెలిపారు తిరు మాణిక్య వాచగరు.
పరమాత్మ పరముగా మన దశేంద్రియములలో దాగి మనలను చైతన్యవంతులను చేస్తున్న పరమాత్మ.
" పిలిచినా పలుకడే ఆ శివుడు" అనేరా జీవుడు
" ప్రతి నాదం వాడే-నువు వినే ప్రతి నాదం వాడే"
( ఈష)
దశేంద్రియములకు అధీనుడను నేను-అతీతుడు శివుడు
మనలోన దాగి మనలను రక్షించును గాక.
అంబే శివే దివ్య తిరువడిగళే శరణం.
ఏక బిల్వం శివార్పణం.

Comments
Post a Comment