TIEUVEMBAVAY-07
తిరువెంబావాయ్-07
*************
"కృపాసముద్రం సుముఖం త్రినేత్రం
జటాధరం పార్వతీ వామభాగం
సదాశివం రుద్రం అనంతరూపం
చిదంబరేశం హృది భావయామి."
సందర్భము
********
విన్సెవియో,కన్నిక్కుళిల్,వాయ్పేశుం అంటూ పంచేంద్రియ జ్ఞానమును ప్రస్తుతించిన తిరు మాణిక్యవాచగరు ప్రస్తుత పాశురములో ఆత్మజ్ఞాన ప్రాశస్త్యమును ప్రశంసిస్తున్నారు.అత్యద్భుత అమృత గుళిక ప్రస్తుత పాశురము.
అంతర్ అంతరోస్థితః అను సత్యమును గ్రహించుటకు మనలను సంసిద్ధులను చేస్తున్నది.
పిబరే శివ అముదం.శిన్నంగళ్ కేట్పుం (అమృతం)
పాశురము
*******
"అన్నే ఇవయుం శిలవో పల అమరర్
ఉన్నర్కు అరియాన్ ఒరువం ఇరుంశీరార్
శిన్నంగళ్ కేట్పు శివనెన్రే వాయ్ తిరప్పాయ్
ఎన్నాన ఎన్ ఆర్-అయన్(ఎన్నరయన్) ఇన్-అముదం (ఇన్నముదం)ఎండ్రోం
తిన్నాయ్ నా మున్నం తీశర్ ఎళురప్పాయ్
కొన్నంగళ్ నివ్వేరాయ్ ఇన్నం తుయిలిడెయొ
వన్నం జపేదరి పోల్ వాళాకిడత్తియాల్
ఎన్నే! తుయిలిల్ ఏలేరో ఎంబావాయ్.
"శివే ఒరువన్"
అన్నది ముఖ్యాంశము.అన్యముకానిది శివము.అని ముప్పదిమూడుకోట్ల దేవతలచేత (పల అమరర్) స్తుతింపబడుచున్న నిజము.
ఆ విషయమును శివజ్ఞానముగా తెలుసుకొనగలుగుటయే ఆత్మజ్ఞానము.
ఇంతకీ నేను అన్నది ఉపాధియా లేక దానిలో దాగిన ఊపిరియా?
ఎన్-నాన-నేను ఎవరు?
ఎన్-ఆర్-అయన్-నాలో దాగియున్నది ఏది?
అని మనలను ప్రశ్నించుకుంటే దొరికే సమాధానమే "శివము"
గోవులోని క్షీరము,వృక్షములోని ఫలము,నది లోని జలము,ఉపాధిలోని ఊపిరి శివముగా మనకు ప్రకటితమగుచు కరుణిస్తున్నది.
అంటే
మానస సరోవరముగ మనసులోని అర్ద్రతగా,గౌరిశంకర శిఖరముగా-చిదంబరముగా-చిద్విలాసముగా నున్నది ఆ చైతన్యమే.
కాని విచిత్రముగా ఆ సత్యము వస్తూ-పోతూ ఉంటుండి పలుమారులు.
వెన్నపడాలంటే చల్లను చిలుకుతూనే ఉండాలి కదా.
పంచేంద్రియ జ్ఞానమును సాధనము చేసుకుని పరమాత్మ తత్త్వమును గ్రహించే శివనోమును చేయుచున్న వేళ ఈ వింతనిద్దుర నీకేలనమ్మా.
మేల్కాంచి మాచే వ్రతమును చేయించవమ్మా అని మేల్కొలుపుతున్నారు ఆ కన్నియలు.
అంబే శివే దివ్య తిరువడిగళే శరణం
ఏక బిల్వం శివార్పణం.

Comments
Post a Comment