SAUMDARYA LAHARI-94
సౌందర్య లహరి-94
పరమపావనమైన నీ పాదరజకణము
పతిత ఆలకమైన పరమాత్మ స్వరూపము
స్థూలమైన భూమికన్న నీరు మిగుల సూక్ష్మమని
పారుచున్న నీటికన్న అగ్ని మిగుల సూక్ష్మమని
మండుచున్న అగ్నికన్న గాలి మిగుల సూక్ష్మమని
వీచుచున్న గాలికన్న నింగి మిగుల సూక్ష్మమని
అందరాని నింగికన్న మనసు మిగుల సూక్ష్మమని
మాయదారి మనసుకన్న భగవత్తత్త్వము సూక్ష్మమని
పరమార్థ మర్మమైన నీ ధర్మ సూక్ష్మములలో
నా బుద్బుదశరీరము పరమాద్భుతమగుచున్న వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
Comments
Post a Comment