Tuesday, September 22, 2020
PRAPASYANTEE MAATAA-07
. ప్రపశ్యనీ మాతా-07
***********************
యాదేవి సర్వభూతేషు ధూమావతి రూపేణ సంస్థితా
నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః.
" ఏకానేక రూపములు దేవి క్రీడలు"
ఏకం సత్ విప్రా బహుదా వదంతి.ఒకే ఒక మూలమును విశేషప్రజ్ఞకలవారైన వారు బహువిధములుగా దర్శించి-తాదాత్మ్యమును పొందుతారు.
పొగనుండి పుట్టినదని కొందరు-పొగచే కప్పబడినదని కొందరు తల్లిని ధూమావతి అని సంబోధిస్తూ-సంకీర్తిస్తుంటారు.
పొగ-నిప్పు అను ద్వంద్వములుగా ప్రకటింపబడుతు క్రమేణా నిర్ద్వంద్వతను మనకు పరిచయము చేస్తుంది తల్లి.నామరూపాతీతమైన నెనరును చూపిస్తుంది.
తల్లి క్రీడాసక్త కనుక మనతో దాగుడుమూతలు అను ఆటను తన ఆవరణ-నిక్షేపక గుణముల ద్వారా ఆడుతుంది.మనకు అర్థము చేయిస్తుంది.ఉదాహరణకు
మన చర్మచక్షువులు ఒక మఱ్ఱి విత్తనమును చూశాయనుకోండి.అవి దాని కొమ్మలను ఊడలను మిగిలిన శాఖలను చూడలేవు.ఎందుకంటే అమ్మ విత్తులో వాటన్నిటిని దాచివేసి,పైకి కనపడకుండా చేస్తుంది.అదియే మాయ ఆవరణ.అదే విత్తనము పంచభూతాత్మక సమ్మిశ్రితమై మహావృక్షమై మన కనులకు మనసుకు విందులు చేస్తుంది.అదే ప్రకటనమనే నిక్షేపకము.అదే విధముగా జగద్వ్యవహారములను నడిపిస్తుంది తల్లి.
దేవి వేడివేలుగులో ఏవిధముగా బింబము తో పాటుగాప్రతిబింబముగా నల్లని నీడగా అనుసరిస్తుందో అదియే ధూమావతి.చీకటితో పోల్చినప్పటికిని,తల్లిని నిద్ర-మరపు-దుఃఖము తో పోల్చినప్పటికిని తల్లి, మనసనే పరుగులుతీసే గుర్రములు లేని రథము పైన కూర్చునుట,పచ్చిమాంస భక్షణమను విషయ వాసనలను మొగ్గలోనే తుంచివేయు చతుర యని,వ్యాకులతను ధూమముగా భావిస్తే దానిని తీసివేసే చిదగ్నికుండ సంభూత అని అనకుండా ఉందగలమా? అమ్మ కారణమును-కార్యమును-దాని ఫలితమును మూడును తానై ముముక్షుత్వమును ప్రసాదిస్తుంది.
అంతే కాదు ఛిన్నమస్తక వర్గీకరించిన సత్తు-అసత్తులను చేటలో
వేసి చెరిగి,అసత్తు (విషయవాసనలను) చెరిగివేసి,శాశ్వత సత్యమును చాటలో (జగతి) చూపించినది తల్లి.మాయ యను పొగను తోసివేసిన చిత్ప్రకాశమును చూడగలము అన్న విషయమును తెలిపినది.
సూక్షముగా పరిశీలిస్తే నా హృదయ వాసియై నన్ను ఆవరించిన మాయ అను పొగను పోగొట్టుకొనుటకు
నాకు నిశ్చల చిత్తమను పొగ గొట్టమును అందించి,నిరంతర సాధన అను గాలిని దాని ద్వారా ఊదుతుంటే,మాయామోహములనే పొగలు తొలగి,ఆత్మతత్త్వమను జ్యోతి ప్రకాశమును దర్శనము చేసుకొనగలవని నన్ను ఉధ్ధరించుచున్న తల్లీ.
ధన్యోస్మి మాతా ధన్యోస్మి.
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment