Friday, October 15, 2021

AMMA KAAMAAKSHI TAAYI-11

శ్రీ మాత్రే నమః ******************* ఎత్తనై జననం ఎడుత్తేనో తెరియాదు ఇబ్బూమి తన్నిలమ్మా ఇనియాకిలుం కృపై వైతెన్ని రక్షియుం ఇని జననం ఎడుత్తిదామల్ ముక్తితర వేణుమేన్ ఉన్నయో తొళుదునాన్ ముక్కాలం నంబినేనే మున్ను పిణం తోణాదా మణితరై పోలనీ ముళితిరుక్కదేయమ్మా వెట్రిపెర ఉన్మీదిల్ భక్తియాయ్ సొన్నకవి విరుత్తంగళ్ పడినుండ్రియుం విరుప్పముడ నీకేట్టి అళిదుడుం శెల్వత్తె విమలనార్ ఏసపోరార్ అత్తరిడ వాగత్తె విట్టువందెన్నరుం కురైగళై తీరునమ్మా అళగాన కాంచియిల్ పుగళాన వాళ్దిడుం అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే. ****************** 11ఎన్నెన్ని జన్మలు నన్ను రాపాడినవో ఈ భూమిపై తెలియదమ్మా ఇప్పటికైనను మరుజన్మ లేకుండ నన్ను రక్షించవమ్మా ముక్తిదాయినివనుచు ముక్కాలములు నిన్ను భక్తితో కొలిచినానే ముందెన్నడు నిన్ను చూడలేదనుచు నను మందభాగ్యుని చేయకమ్మా భక్తులకు కామాక్షి విరుత్తానుగ్రహము సర్వతోముఖ విజయము ఒప్పుకొన నీకిట్టి బెట్టుసరి శర్వాణి విభుని విడి బ్రోవవమ్మా అక్షయంబైన నీ వీక్షణముతో మా ఆపదలుకడతేరునమ్మా అవ్యాజకరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే. అమ్మ కామాక్షి ఉమయే. విరుత్తములోని పదవ భాగములో కామాక్షి తల్లి భక్తుని కోరికను తీర్చదలచి,హంసవాహినియై ముందుకు వచ్చి నిలిచి సాక్షాత్కరించినది.సాధకునిలో సత్వగుణము ప్రచోదనమైనదేమో,త్రికరణ శుధ్ధుడై అమ్మను అర్చించుచున్నాడు. "పాలించు కామాక్షి పావని పాపసమని" అని ప్రస్తుతించుచున్నాడు. తల్లీ నీవు సుజనులకెల్లా సంతోష ప్రదాయినివి(ఇహములో) మనోరథప్రదాయినిగా పేరుపొందితివి. దశరథములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు పంచేంద్రియములు మన ఉపాధి అను రథమును అమ్మ అందించుచున్న శక్తితో, తల్లి కరుణ అనే సారథితో బహుముఖములుగా నడిపించుచు తేజోవంతము చేయుచున్నవి. వీటిలో రథము-రథనిర్మాణ పరికరముల్లు-రథ సారథి-రథ గమనము-రథ గమ్యము అన్నీ కామాక్షి తాయి కరుణయే. రుద్రనమకములో చెప్పినట్లు, " రథేభ్యో-రథపతిభ్యశ్చవ" నమో నమః. అమ్మ కామాక్షి తాయి విరుత్తమును పఠించిననౌ-వినినను-మననము చేసికొనినను సకల సౌభాగ్యప్రదము. అసలు తమిళమే తెలియని నాచే కుప్పలుకుప్పలుగా దొరిలిన తప్పులను సవరించినను సభక్తిపూర్వక అర్చనయే.సౌభాగ్య ప్రదమే. ఆ తేజస్సు వాటిది కాదు.తల్లి తేజోమయ కీర్తి విస్పూర్తివంతమై మనలోని దశ ఇంద్రియములను మన మనోరథము ఈప్సితమును నెరవేర్చుకొనుటకు సహకరించునట్లు చేయునది తల్లి సాక్షాత్కారము. ఫల స్తుతి/ఫలశృతి ------------------- విరుత్తానుగ్రహము సర్వత్ర విజయప్రదము.అమ్మ కృపావీక్షణము అనవరతము అతులిత శుభప్రదము. మిత్రులారా! నా ఈ చిన్ని ప్రయత్నము పెద్ద మనసుతో ప్రోత్సహించిన మీ అందరికి పేరునా ధన్యవాదములు. మీ సోదరి,నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి .

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...